ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల కోసం విద్యార్థుల ర్యాలీ…

Students Rally in Hanamkonda

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపునకు విద్యార్థుల ర్యాలీ

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హనుమకొండలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం నుంచి హనుమకొండ కలెక్టరేట్ వరకు జరిగిన ర్యాలీలో పాల్గొని విద్యార్థులకు మద్దతు తెలిపారు.

డిగ్రీలు పూర్తి చేసినప్పటికీ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉండటంతో పలువురు విద్యార్థులు తమ విద్యా సర్టిఫికెట్లు పొందలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ర్యాలీలో పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపుతున్న ఈ సమస్యను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పూర్తిగా చెల్లించే వరకు విద్యార్థుల తరఫున పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు.


Students Rally in Hanamkonda Seeking Clearance of Fee Reimbursement Dues

Students organised a rally in Hanamkonda demanding the immediate release of pending fee reimbursement dues and resolution of their long-standing issues. The rally proceeded from the Ambedkar statue to the Hanamkonda Collectorate, with support extended to the protesting students.

It was pointed out that several students who have completed their degrees are unable to obtain their educational certificates because their fee reimbursement dues remain pending. The government was urged to address the issue immediately to prevent further difficulties for students.

The protestors said they would continue their fight until the pending fee reimbursement dues are fully cleared.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *