Young India Residential Schools: Telangana’s Push for World-Class Education

తెలంగాణలో ప్రతి చిన్నారికి ప్రపంచ స్థాయి విద్యను అందించాలనే లక్ష్యంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ వేగంగా రూపుదిద్దుకుంటున్నాయి. కులం, మతం, ప్రాంతం, కుటుంబ నేపథ్యంతో సంబంధం లేకుండా సమాన విద్యా అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యంగా పేర్కొంది.
ప్రతి నియోజకవర్గంలో అత్యాధునిక వసతులతో నిర్మిస్తున్న ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్య అందించేలా రూపొందిస్తున్నారు. ఆర్థిక, సామాజిక అసమానతలను తగ్గిస్తూ విద్య ద్వారా పిల్లలకు మెరుగైన భవిష్యత్తు అందించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది.
ఈ విద్యాసంస్థలు విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచన, పరిపాలనా నైపుణ్యాలు, వ్యాపార దృక్పథం, నాయకత్వ లక్షణాలను పెంపొందించేలా అభివృద్ధి చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. భవిష్యత్ తరాలకు బలమైన పునాదులు వేస్తూ తెలంగాణ విద్యా రంగంలో కొత్త నమూనాగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిలవనున్నాయని పేర్కొంది.
In Telangana, Young India Integrated Residential Schools are being developed rapidly with the stated objective of providing world-class education to every child, irrespective of caste, religion, region or family background. The government says the initiative is aimed at reducing economic and social inequalities by ensuring equal access to quality education.
The schools, being constructed with modern facilities in every constituency, are designed to provide quality residential education, particularly to children from economically disadvantaged families. The initiative focuses on creating opportunities for students to develop scientific thinking, leadership abilities, administrative skills and an entrepreneurial outlook.
The government has projected the Young India Integrated Residential Schools as a new model in Telangana’s education sector, with the aim of providing stronger foundations for the future of students and creating opportunities for them to become scientists, administrators, entrepreneurs and contributors to nation-building.