మూసారాంబాగ్‌ వంతెన పనులు పూర్తి

English News Headline

GHMC Commissioner R. V. Karnan Inspects Moosarambagh Bridge, Nalgonda Flyover Works

Full Telugu News Article

హైదరాబాద్‌లో కీలక మౌలిక వసతుల పనుల పురోగతిని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ శ్రీ ఆర్‌.వి. కర్ణన్‌ పరిశీలించారు. చీఫ్‌ ఇంజినీర్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌ (శానిటేషన్‌)తో పాటు జీహెచ్‌ఎంసీ అధికారులు ఆయన వెంట ఉన్నారు.

మూసారాంబాగ్‌ వంతెన పనులు పూర్తయ్యాయని కమిషనర్‌ తెలిపారు. ఈ వంతెన అందుబాటులోకి వస్తే అంబర్‌పేట్‌ నుంచి మలక్‌పేట్‌, దిల్‌సుఖ్‌నగర్‌, నాగోల్‌ ప్రాంతాలకు కీలక రాకపోకల అనుసంధానం మరింత మెరుగుపడనుంది.

వంతెన ప్రారంభోత్సవానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను సిద్ధంగా ఉంచాలని కమిషనర్‌ అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రారంభానికి ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు.

నల్గొండ ఫ్లైఓవర్‌ పనుల్లో ప్రధాన ఫ్లైఓవర్‌ పూర్తయింది. ఏ4 అప్‌ ర్యాంప్‌ పనులను నేటిలోగా పూర్తి చేయాలని, చంపాపేట్‌ వైపు ఉన్న ఏ3 సైడ్‌ ర్యాంప్‌ పనులను రెండు నుంచి మూడు రోజుల్లో పూర్తి చేయాలని కమిషనర్‌ అధికారులను ఆదేశించారు.

ఈ పనులు పూర్తయి ఫ్లైఓవర్‌ అందుబాటులోకి వస్తే చంచల్‌గూడ, సైదాబాద్‌, సంతోష్‌నగర్‌, ఐఎస్‌ సదన్‌, ఓవైసీ ఆసుపత్రి, కంచన్‌బాగ్‌, చంపాపేట్‌, సాగర్‌ రోడ్‌ మార్గాల్లో ప్రయాణించే వాహనదారులకు గణనీయమైన ట్రాఫిక్‌ ఉపశమనం లభించనుంది.

Full English News Article

GHMC Commissioner Sri R. V. Karnan, IAS, inspected the ongoing infrastructure works at Moosarambagh Bridge and Nalgonda Flyover along with the Chief Engineer, Assistant Commissioner (Sanitation) and other GHMC officials.

The Moosarambagh Bridge work has been completed. Once operational, the bridge will strengthen vital connectivity from Amberpet towards Malakpet, Dilsukhnagar and Nagole, improving movement along these important city corridors.

The Commissioner instructed officials to keep all arrangements ready for the inauguration of the completed bridge and ensure that the required preparations are in place.

At Nalgonda Flyover, the main flyover has already been completed. Commissioner Karnan directed officials to complete the A4 up-ramp by today and finish the A3 side ramp towards Champapet within two to three days.

The completion of the remaining ramp works is expected to pave the way for the flyover’s inauguration. Once operational, the facility will provide significant relief to commuters travelling through Chanchalguda, Saidabad, Santosh Nagar, IS Sadan, Owaisi Hospital, Kanchan Bagh, Champapet and Sagar Road.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *