రాష్ట్రవ్యాప్తంగా ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’.. 2.21 లక్షల ఇళ్లలో గృహప్రవేశాలు
English News Headline
Telangana to Celebrate ‘Maa Indiramma Intlo Deepavali’ in 2.21 Lakh Indiramma Houses
Full Telugu News Article
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఈ దీపావళి పండుగను ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి ప్రత్యేకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమాన్ని చేపట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన మేరకు ఇప్పటికే గృహప్రవేశాలు పూర్తిచేసుకున్న ఇందిరమ్మ ఇళ్లలో ప్రజాప్రతినిధులు, అధికారులు లబ్ధిదారులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొననున్నారు.
ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం తొలి విడతలో మంజూరు చేసిన 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లలో ఇప్పటివరకు 2,21,500 ఇళ్లలో గృహప్రవేశాలు పూర్తయినట్లు తెలిపారు.
ఈ దీపావళి సందర్భంగా ప్రతి పేద కుటుంబంలో ఆనందం నింపాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గృహప్రవేశాలు పూర్తయిన ఇందిరమ్మ ఇళ్లలో ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, గృహ నిర్మాణ శాఖ అధికారులు, ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యులు పాల్గొనాలని సూచించారు.
లబ్ధిదారుల కుటుంబాలతో కలిసి ప్రతి ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించాలని మంత్రి కోరారు. అర్హులైన ఇల్లు లేని ప్రతి నిరుపేద కుటుంబానికి సొంత ఇల్లు కల్పించడమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
రైతుల సమక్షంలోనే భూముల రీసర్వే
మరోవైపు, మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టరేట్‌లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని భూ సర్వే, రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, హౌసింగ్ శాఖలకు సంబంధించిన అంశాలపై విస్తృత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి శ్రీధర్ బాబు, పార్లమెంటు సభ్యులు, శాసనమండలి, శాసనసభ సభ్యులతో కలిసి రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి అధికారులతో ఈ సమావేశం నిర్వహించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు.
మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు సంబంధించిన పలు సమస్యలను ప్రజాప్రతినిధులు సమావేశంలో ప్రస్తావించారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని చేపడుతున్న భూముల రీసర్వేను రైతుల సమక్షంలోనే నిర్వహించి భూ సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి వెల్లడించారు.
రీసర్వే జరుగుతున్న గ్రామాల్లో తహసీల్దార్లు ప్రతిరోజూ పర్యటించాలని, ఆర్డీవోలు, అదనపు కలెక్టర్లు, కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. కనీసం వారానికి ఒకరోజు రీసర్వే గ్రామాలను సందర్శించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
రెవెన్యూ, అటవీ శాఖల మధ్య సరిహద్దు వివాదాలు, పట్టా భూముల సమస్యలు, భూముల హద్దులకు సంబంధించిన వివాదాలను సమగ్ర సర్వే ద్వారా గుర్తించి పరిష్కరించాలని స్పష్టం చేశారు. 22-ఏకు సంబంధించి గతంలో జారీ చేసిన జీవోలు, మెమోల ద్వారా పరిష్కారం కాని సమస్యలను పరిశీలించి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు.
Full English News Article
The Telangana government has announced a special initiative titled ‘Maa Indiramma Intlo Deepavali’ to celebrate the festival of lights with beneficiaries of the Indiramma housing scheme across the state.
The programme, following the suggestion of Chief Minister A. Revanth Reddy, aims to bring festive cheer to poor families who have already completed housewarming ceremonies in their newly constructed Indiramma houses.
Minister Ponguleti Srinivasa Reddy shared details of the initiative, stating that out of the 4.50 lakh houses sanctioned in the first phase, housewarming ceremonies have been completed in 2,21,500 houses so far.
He called upon MLAs, local public representatives, district collectors, Housing Department officials and Indiramma housing committee members to participate in the celebrations along with the beneficiaries.
The minister urged representatives and officials to celebrate Deepavali at completed Indiramma houses across Telangana, ensuring that the festival brings happiness and a sense of dignity to beneficiary families.
He reiterated that the government’s objective is to provide houses to every eligible poor family that does not own a home.
Land Resurvey to Be Conducted in the Presence of Farmers
Meanwhile, a comprehensive review meeting was held at the Medchal-Malkajgiri Collectorate to discuss land surveys, revenue matters, stamps and registration, and housing-related issues concerning the erstwhile Rangareddy district.
The meeting was attended by Legislative Assembly Speaker Gaddam Prasad Kumar, Minister Sridhar Babu, Members of Parliament, Members of the Legislative Council and Legislative Assembly, along with state, district and mandal-level officials.
Representatives raised several issues concerning Medchal-Malkajgiri, Rangareddy and Vikarabad districts.
Minister Ponguleti Srinivasa Reddy said officials had been instructed to conduct the comprehensive land resurvey in the presence of farmers and resolve land-related disputes in their interest.
He directed Tahsildars to visit villages undergoing resurvey every day. Revenue Divisional Officers, Additional Collectors and Collectors were asked to continuously monitor the process and visit the resurvey villages at least once a week.
The minister also instructed officials to identify and resolve boundary disputes between the Revenue and Forest Departments, issues concerning patta lands and land-boundary disagreements through the comprehensive survey.
He further directed officials to examine pending issues under Section 22-A that remain unresolved despite previously issued government orders and memorandums, and take immediate action
See new posts
Conversation
రాష్ట్రవ్యాప్తంగా “మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి” కార్యక్రమం ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వాములు కావాలి రాష్ట్రవ్యాప్తంగా రైతుల సమక్షంలోనే సమగ్ర భూ సర్వే భూ వివాదాలకు శాశ్వత పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం ఈరోజు మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టరేట్ లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని భూ సర్వే, రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, హౌసింగ్ శాఖలకు సంబంధించిన అనేక అంశాలపై శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్
గారు, సహచర మంత్రి శ్రీధర్ బాబు
గారు, పార్లమెంటు సభ్యులు, శాసనమండలి, శాసనసభ సభ్యులతో కలిసి రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి అధికారులతో విస్తృత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి మరియు వికారాబాద్ జిల్లాలకు సంబంధించి పలు సమస్యలను ప్రజా ప్రతినిధులు ప్రస్తావించారు. ప్రధానంగా రైతుల ప్రయోజనాల కోసమే చేపట్టిన భూముల రీసర్వే వారి సమక్షంలోనే చేసి భూ సమస్యల పరిష్కరించాలని అధికారులను ఆదేశించాను. అదే విధంగా రీసర్వే జరిగే గ్రామాల్లో ప్రతిరోజు తహశీల్దార్లు పర్యటించాలి. ఆర్డీవో, అదనపు కలెక్టర్లు, కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించడమేగాక కనీసం వారానికోరోజు రీసర్వే జరిగే గ్రామాలకు వెళ్లాలని సూచించడం జరిగింది. రెవెన్యూ, అటవీ శాఖల మధ్య సరిహద్దు వివాదాలు, పట్టా భూములకు సంబంధించిన సమస్యలు, భూముల హద్దులపై నెలకొన్న వివాదాలు వంటి అంశాలను కూడా సమగ్ర సర్వే ద్వారా గుర్తించి పరిష్కరిష్కరించాలి. 22ఎ కు సంబంధించి ఇప్పటివరకు ఇచ్చిన జీవోలు, మెమోలతో పరిష్కారం కానీ అంశాలు ఏమైనా ఉంటే పరిశీలించి వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాను. రాష్ట్రవ్యాప్తంగా “మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి” అంతకుముందు నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రతిష్టాత్మక ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన “మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి” కార్యక్రమానికి సంబంధించిన వివరాలను వెల్లడించడం జరిగింది. పేదల ఆత్మగౌరవానికి చిహ్నమైన ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వాలన్న సంకల్పంతో ప్రజాప్రభుత్వం తొలివిడత మంజూరు చేసిన 4.50 లక్షల ఇండ్లలో ఇప్పటికి 2,21,500 గృహప్రవేశాలు పూర్తయ్యాయి. ఈ దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన మేరకు ప్రతి పేద కుటుంబంలో ఆనందాల వెలుగులు నిండి, ప్రతి ఇందిరమ్మ ఇంటి గడపలో దీపావళి కాంతులు విరజిమ్మాలని “మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి” అనే ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు గృహప్రవేశాలు జరుపుకున్న ఇందిరమ్మ ఇళ్లలో ఈ దీపావళి రోజున ఎమ్మెల్యేలతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, గృహ నిర్మాణ శాఖ అధికారులు, ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరూ భాగస్వాములై మాఇందిరమ్మ ఇంట్లో దీపావళి అనే వేడుకను లబ్దిదారులతో కలిసి కన్నుల పండుగగా ఘనంగా నిర్వహించాలని సూచిస్తున్నాను.. రాష్ట్రంలో అర్హులైన ఇల్లు లేని ప్రతి నిరుపేద కుటుంబానికి ఇల్లు ఇవ్వాలన్నదే ఇందిరమ్మ ప్రభుత్వ సంకల్పం.