హైదరాబాద్ సదర్ ఉత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

English News Headline

Hyderabad Sadar Utsav: CM Revanth Reddy Extends Greetings to Yadav Community

Full Telugu News Article

హైదరాబాద్ సదర్ ఉత్సవాల సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి యాదవ సోదర, సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, పశుసంపద వైభవానికి ప్రతీకగా నిలిచే సదర్ ఉత్సవాలు యాదవుల ఆత్మగౌరవం, ఐక్యత, వారసత్వ గొప్పతనాన్ని ప్రతిబింబిస్తాయని పేర్కొన్నారు.

ప్రత్యేకంగా అలంకరించిన దున్నపోతుల ప్రదర్శనలు, వాటి ఠీవి, దర్పం, సందడి సదర్ ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ వేడుకలు యాదవుల జీవన విధానం, సంప్రదాయాలు, సంస్కృతిని చాటిచెబుతాయని పేర్కొన్నారు.

హైదరాబాద్‌లో నిర్వహించే సదర్ ఉత్సవాలు ప్రతి యాదవ కుటుంబంలో ఆనందోత్సాహాలు నింపాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. యాదవ సోదర, సోదరీమణులకు సిరిసంపదలు, ఆయురారోగ్యాలు కలగాలని, వారి ఐక్యత, సామాజిక అభ్యున్నతి మరింత బలోపేతం కావాలని శుభాకాంక్షలు తెలిపారు.

Full English News Article

Telangana Chief Minister A. Revanth Reddy extended his heartfelt greetings to members of the Yadav community on the occasion of Hyderabad Sadar Utsav.

Describing the festival as a symbol of Telangana’s culture, traditions and livestock heritage, the Chief Minister said that Sadar Utsav reflects the self-respect, unity and rich cultural legacy of the Yadav community.

He highlighted the specially decorated buffaloes, whose majestic appearance, grandeur and festive participation remain major attractions of the celebrations. He said the festival showcases the traditional lifestyle and cultural heritage of the Yadav community.

The Chief Minister expressed his wish that Hyderabad Sadar Utsav bring happiness and enthusiasm to every Yadav family. He also wished the community prosperity, good health and continued progress, while hoping that unity and social development among Yadavs would grow stronger.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *