మర్రి చెన్నారెడ్డి టిమ్స్ తొలి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ భేటీ…

MCR TIMS First EC Meeting

డాక్టర్ మర్రి చెన్నారెడ్డి టిమ్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ తొలి సమావేశం

ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధ్యక్షతన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి టిమ్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ తొలి సమావేశం హైదరాబాద్‌లోని టిమ్స్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్‌లో నిర్వహించారు. ఆసుపత్రి నిర్వహణ, పరిపాలన, వైద్య సేవలకు సంబంధించిన అంశాలపై సమావేశంలో చర్చించినట్లు సమాచారం.

ఈ సమావేశంలో ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా జడ్ చొంగ్తు, టీజీఎంఎస్‌ఐడీసీ ఎండీ డాక్టర్ గౌరవ్ ఉప్పల్, డాక్టర్ ఎంసీఆర్ టిమ్స్ డైరెక్టర్ డాక్టర్ నరేంద్ర కుమార్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ వాణి, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ రవిందర్ నాయక్, నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్ పాల్గొన్నారు.

ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ తొలి సమావేశం కావడంతో టిమ్స్‌లో వైద్య, పరిపాలనా వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, ఆసుపత్రి కార్యకలాపాలకు సంబంధించిన అంశాలపై అధికారులు చర్చించినట్లు తెలుస్తోంది.

English

First Executive Council Meeting of Dr Marri Channa Reddy TIMS Held

The first meeting of the Executive Council of Dr Marri Channa Reddy Telangana Institute of Medical Sciences (TIMS) was held at the TIMS Administrative Block in Hyderabad under the chairmanship of Health Minister Damodar Rajanarsimha.

The meeting was attended by Health Department Principal Secretary Dr Christina Z Chongthu, TGMISIDC Managing Director Dr Gaurav Uppal, Dr MCR TIMS Director Dr Narendra Kumar, Director of Medical Education Dr Vani, Director of Public Health Dr Ravinder Naik and NIMS Director Dr Rahul Devaraj.

As the first meeting of the Executive Council, discussions focused on matters related to the administration, medical services and effective functioning of the institution. The meeting also provided a platform to review key requirements for strengthening the hospital’s operational and administrative systems.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *