English News Headline
Annadanam Organised at Sri Renuka Ellamma Temple in Shamirpet

పూర్తి తెలుగు వార్త
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట మండల కేంద్రంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయం వద్ద మంగళవారం భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శామీర్‌పేట గౌడ సంఘం ఆధ్వర్యంలో భక్తులకు ఘనంగా అన్నప్రసాద వితరణ చేపట్టారు.
ఈ అన్నదాన కార్యక్రమానికి శామీర్‌పేటకు చెందిన బండి బాల్‌రాజ్ గౌడ్ – మహేశ్వరి దంపతులు, చావర్తి గణేష్ కుటుంబ సభ్యులు సహకారం అందించారు.
అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో ఆలయానికి విచ్చేసిన భక్తులతో పాటు మాజీ ప్రజాప్రతినిధులు, రాజీవ్ రహదారిపై ప్రయాణిస్తున్న భక్తులు కూడా పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు.
అమ్మవారి ఆశీస్సులతో నిర్వహించిన ఈ సేవా కార్యక్రమం భక్తుల విశేష ఆదరణ పొందింది. కార్యక్రమంలో గౌడ సంఘం సభ్యులు, ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.
English News Headline
Annadanam Organised at Sri Renuka Ellamma Temple in Shamirpet
Full English News Article
Special prayers were offered at Sri Renuka Ellamma Temple in Shamirpet of Medchal-Malkajgiri district on Tuesday. Following the rituals, a large-scale Annadanam (free food distribution) programme was organised by the Shamirpet Gouda Association.
The event received support from Bandi Balraj Goud and Maheshwari couple and the family members of Chavarthi Ganesh, who contributed towards the food distribution.
Devotees visiting the temple, former public representatives, and pilgrims travelling along the Rajiv Rahadari participated in the programme and received the prasadam.
The organisers said the initiative was conducted as a devotional service to Goddess Renuka Ellamma and witnessed enthusiastic participation from devotees and local residents.

