English News Headline
Welfare Schemes for All Eligible, Says Chairperson

అలియాబాద్ మున్సిపాలిటీలో నిర్వహించిన సమావేశంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని చైర్పర్సన్ తెలిపారు. ప్రజలు దరఖాస్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు.
At a meeting in Aliabad Municipality, the Chairperson assured that welfare schemes will be provided to all eligible beneficiaries and urged people to apply.
తెలంగాణలోని శామీర్పేట మండలం అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమం భాగంగా సమావేశం నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి అధ్యక్షతన మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వ పథకాల అమలుపై చర్చించారు.
ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలు ముందుకు వచ్చి దరఖాస్తు చేసుకోవాలని కోరారు. విద్యుత్, మంచినీటి సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
సమావేశంలో వివిధ శాఖల అధికారులు ప్రజలకు అందిస్తున్న పథకాలపై వివరాలు అందించారు. చేయూత పెన్షన్, ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇండ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, డ్వాక్రా మహిళలకు రుణాలు, స్త్రీశక్తి క్యాంటీన్లు, వ్యవసాయ శాఖ పథకాలు వంటి అంశాలపై అవగాహన కల్పించారు.
మున్సిపల్ పరిధిలోని తుర్కపల్లి, లాల్ గడి మలక్పేట వార్డుల్లో తక్కువ వోల్టేజ్ సమస్య ఉందని కౌన్సిలర్లు పేర్కొన్నారు. వేసవిలో తాగునీటి సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్, వైస్ చైర్పర్సన్ మాలతి, కౌన్సిలర్లు, వివిధ శాఖల అధికారులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.
A meeting was held under the Praja Palana–Pragathi Pranalika program in Aliabad Municipality of Shamirpet mandal, Telangana. The meeting, chaired by Municipal Chairperson Kantham Sirisha Krishna Reddy, focused on implementation of welfare schemes.
The Chairperson stated that all eligible beneficiaries would receive government welfare schemes and urged people to apply. Officials were instructed to address electricity and drinking water issues promptly.
Officials from various departments explained schemes such as Cheyutha pension, free bus travel, Indiramma housing, 200 units of free electricity, loans for DWCRA women, Stree Shakti canteens, and agriculture schemes.
Councillors highlighted low voltage issues in Turkpally and Lal Gadi Malakpet wards. Preventive measures were suggested to avoid drinking water shortages during summer.
Municipal Commissioner Chandrasekhar, Vice Chairperson Malathi, councillors, officials, and local residents attended the meeting.