శామీర్‌పేట ఎల్లమ్మ ఆలయంలో అన్నప్రసాద వితరణ

English News Headline

Devotees Participate In Annadanam At Sri Renuka Ellamma Temple In Shamirpet

Full Telugu News Article

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట మండల కేంద్రంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయం వద్ద మంగళవారం భక్తి శ్రద్ధల మధ్య అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, ఆర్చనలు నిర్వహించారు.

భక్తులు అమ్మవారికి ఓడి బియ్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ప్రత్యేక దర్శనం చేసుకున్నారు. ఆలయం ప్రాంగణంలో గౌడ్ సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు.

కీసర మండలం ధర్మారం గ్రామానికి చెందిన ఈగ శ్రీనివాస్, బాలాపూర్‌కు చెందిన నిరంజన్ గౌడ్ – విజయలక్ష్మి దంపతులు, శామీర్‌పేటకు చెందిన యాస్కి పాండర్ గౌడ్ కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమానికి సహకారం అందించారు. అలాగే దూడల బాలరాజ్ గౌడ్ – మణెమ్మ దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులు 100 కేజీల బియ్యాన్ని అన్నదానానికి విరాళంగా అందజేశారు.

ఎల్లమ్మ తల్లి ఆలయానికి విచ్చేసిన భక్తులతో పాటు మాజీ ప్రజాప్రతినిధులు మరియు రాజీవ్ రహదారిపై ప్రయాణిస్తున్న భక్తులు కూడా అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమం భక్తి వాతావరణంలో కొనసాగింది.

Full English News Article

Annadanam was organised on a grand scale at the Sri Renuka Ellamma Temple in Shamirpet mandal centre of Medchal-Malkajgiri district on Tuesday.

Special pujas and rituals were performed for Goddess Ellamma at the temple. Devotees offered rice and fulfilled their vows while a large number of worshippers visited the temple for darshan during the programme.

The annadanam programme was conducted under the supervision of the Goud community members at the temple premises. Several devotees and donors extended support for the food distribution programme.

Eega Srinivas from Dharmaram village in Keesara mandal, Niranjan Goud and Vijayalakshmi couple from Balapur, and members of Yaski Pandar Goud’s family from Shamirpet contributed towards the annadanam event. Dudala Balaraj Goud and Manemma couple along with their family members donated 100 kilograms of rice for the programme.

Devotees visiting the Ellamma temple, former public representatives and travellers passing through the Rajiv Highway also participated and received annaprasadam during the event.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *