ULLAS Mela 2026 ప్రారంభం…

ULLAS Mela 2026 ప్రారంభం | ULLAS Mela Highlights Universal Literacy & Digital Empowerment

న్యూఢిల్లీలోని నేషనల్‌ బాల్‌ భవన్‌లో ULLAS మేళా 2026ను పాఠశాల విద్య, అక్షరాస్యత శాఖ కార్యదర్శి టి.కె. అనిల్‌ కుమార్‌ ప్రారంభించారు. సార్వత్రిక అక్షరాస్యత, జీవితాంతం అభ్యసనం, నైపుణ్యాభివృద్ధి, డిజిటల్‌ సాధికారత ప్రాధాన్యాన్ని ఆయన వివరించారు.

ULLAS మేళా 2026లో వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, స్వయంప్రతిపత్తి సంస్థలు ఏర్పాటు చేసిన ప్రదర్శన స్టాళ్లలో ULLAS కార్యక్రమాల కింద చేపడుతున్న వివిధ కార్యక్రమాలు, వినూత్న విధానాలు, ఉత్తమ పద్ధతులను ప్రదర్శించారు.

ప్రతి ఒక్కరికీ అక్షరాస్యతను అందించడంతో పాటు జీవితాంతం నేర్చుకునే అవకాశాలను కల్పించడం, నైపుణ్యాలను అభివృద్ధి చేయడం, డిజిటల్‌ సాధికారతను పెంపొందించడం ULLAS కార్యక్రమం లక్ష్యాల్లో కీలకమైనవిగా కార్యక్రమంలో ప్రస్తావించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల విద్య, అక్షరాస్యత శాఖ అదనపు కార్యదర్శి అర్చనా శర్మ అవస్థి, NCERT డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ దినేష్‌ ప్రసాద్‌ సక్లానీతో పాటు వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధులు పాల్గొన్నారు.

ULLAS Mela 2026 was inaugurated by Secretary, Department of School Education and Literacy (DoSEL), T. K. Anil Kumar at National Bal Bhavan in New Delhi. He highlighted the importance of universal literacy, lifelong learning, skill development and digital empowerment.

Exhibition stalls set up by various states, Union Territories and autonomous bodies showcased diverse ULLAS initiatives, innovative practices and successful models aimed at promoting literacy and lifelong learning.

The event emphasised the role of ULLAS in expanding literacy opportunities, encouraging continuous learning, developing skills and strengthening digital empowerment among learners and communities.

Additional Secretary, DoSEL, Archana Sharma Awasthi, Director of NCERT, Prof. Dinesh Prasad Saklani, and representatives from various states and Union Territories participated in the event.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *