Grand Annadanam Held at Sri Renuka Yellamma Temple in

శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయం వద్ద అన్న ప్రసాద వితరణ
శామీర్‌పేట, సెప్టెంబర్ 8 (ప్రజా మలుపు): శామీర్‌పేట మండల కేంద్రంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయం వద్ద మంగళవారం ఘనంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా, భక్తులు ఒడి బియ్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
శామీర్‌పేటకు చెందిన మాజీ సర్పంచ్ కీ.శే. గడియారం నాగరాజు (పంతులు) జ్ఞాపకార్థం ఆయన కుటుంబ సభ్యులు ఆలయం వద్ద అన్నదానం ఏర్పాటు చేశారు. ఆలయానికి విచ్చేసిన భక్తులతో పాటు మాజీ ప్రజా ప్రతినిధులు, రాజీవ్ రహదారి మీదుగా ప్రయాణిస్తున్న భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆలయ పరిసరాల్లో భక్తుల సందడి నెలకొంది. భక్తులకు అన్న ప్రసాదం అందించేందుకు కుటుంబ సభ్యులు మరియు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.
Annadanam Held at Sri Renuka Yellamma Temple

Shamirpet, September 8 (Praja Malupu): A grand annadanam (free food distribution) programme was organised at the Sri Renuka Yellamma Temple in Shamirpet on Tuesday. Special prayers were offered to Goddess Yellamma on the occasion, while devotees offered odi biyyam and fulfilled their vows.
The family members of late Gadiaram Nagaraju (Pantulu), former sarpanch of Shamirpet, organised the annadanam at the temple in his memory.
Devotees visiting the Sri Renuka Yellamma Temple, former public representatives and devotees travelling along Rajiv Rahadari also participated in the programme and received the annaprasadam.
The temple premises witnessed a devotional atmosphere as devotees gathered in large numbers. The organisers and family members made arrangements to distribute food to the devotees.