English News Headline
Telangana Chief Secretary S. Jaju Inspects Industrial Units and Radial Road Works in Rangareddy

Full Telugu News Article
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం హైతాబాద్లోని సీటీఆర్ఎల్ఎస్ (CTRLS), వెల్స్పన్ పారిశ్రామిక యూనిట్లను తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్. జైజు పరిశీలించారు. అదే ప్రాంతంలో కొనసాగుతున్న రేడియల్ రోడ్డు నిర్మాణ పనుల పురోగతిని కూడా ఆయన సమీక్షించారు.
పరిశ్రమల కార్యకలాపాలు, మౌలిక సదుపరాల అవసరాలు, రహదారి నిర్మాణ పనుల స్థితిగతులపై కంపెనీ ప్రతినిధులు, సంబంధిత అధికారులతో చర్చించారు. పారిశ్రామిక అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాలని, రహదారి అనుసంధానాన్ని మెరుగుపరచాలని ప్రధాన కార్యదర్శి సూచించారు.
కొనసాగుతున్న పనులను వేగవంతం చేసి, ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలను సమకూర్చడంపై ఆయన దృష్టి సారించారు.
ఈ పర్యటనలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (FCDA) కమిషనర్ శశాంక, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి, ఆర్డీఓ పార్థ సింహా రెడ్డి, ఇంజినీరింగ్ అధికారులు, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Full English News Article
Telangana Chief Secretary S. Jaiju inspected the CTRLS and Welspun industrial units at Haithabad in Shabad Mandal, Rangareddy district, and reviewed the ongoing Radial Road construction works.
During the field visit, he discussed industrial operations, infrastructure requirements and the progress of road construction with company representatives and concerned officials.
The Chief Secretary stressed the need to strengthen industrial infrastructure, improve road connectivity and accelerate ongoing works to support industrial growth and the development of Future City.
FCDA Commissioner Shashanka, Rangareddy District Collector C. Narayana Reddy, RDO Partha Simha Reddy, engineering officials and other concerned officers accompanied him during the inspection.