English News Headline
Telangana CM Revanth Reddy Highlights SC, ST Welfare Measures Before Parliamentary Committee

Full Telugu News Article
హైదరాబాద్: తెలంగాణలో షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. విద్య, ఉపాధి, ఆర్థిక, రాజకీయ రంగాల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు సముచిత అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు.
హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీలో షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల సంక్షేమంపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ ముఖ్యమంత్రితో సమావేశమైంది. ఈ భేటీలో కమిటీ చైర్మన్ డాక్టర్ ఫగ్గన్ సింగ్ కులస్తేతో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి కోసం చేపడుతున్న కార్యక్రమాలు, తీసుకున్న నిర్ణయాలను ముఖ్యమంత్రి వివరించారు. శాసనసభ స్పీకర్ పదవితో పాటు మంత్రివర్గంలోనూ దళితులకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించినట్లు తెలిపారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్‌తో పాటు వివిధ కార్పొరేషన్లలో కూడా అవకాశాలు కల్పించినట్లు పేర్కొన్నారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయం చరిత్రలో తొలిసారిగా దళితుడికి వైస్ ఛాన్సలర్‌గా అవకాశం కల్పించామని ముఖ్యమంత్రి వివరించారు. ఉస్మానియాతో పాటు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, రాజీవ్ గాంధీ ఐఐఐటీలలోనూ ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారికి వైస్ ఛాన్సలర్లుగా అవకాశం కల్పించినట్లు తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్లు, ఆరోగ్యశ్రీలో ప్రాధాన్యత
రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు సీఎం వెల్లడించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్), ఆరోగ్యశ్రీ పథకాల కింద ఖర్చు చేస్తున్న నిధుల్లో 50 శాతానికి పైగా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు వెచ్చిస్తున్నట్లు వివరించారు.
దేశంలోనే తొలిసారిగా ఎస్సీ వర్గీకరణను అమలు చేసిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ అమలు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు వంటి చర్యలను పార్లమెంటరీ కమిటీ సభ్యులు అభినందించినట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది.
ఈ సమావేశంలో ఎంపీలు డాక్టర్ మల్లు రవి, తాపిర్ గావో, హెచ్.సి. మీనా, అనిల్ ఫిరోజియా, అరుణ్ కుమార్ సాగర్, దగ్గుమల్ల ప్రసాద రావు, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పలువురు ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు కూడా సమావేశానికి హాజరయ్యారు.
Full English News Article
Hyderabad: Telangana Chief Minister A. Revanth Reddy has reiterated that the state government is according the highest priority to the welfare of Scheduled Castes (SCs) and Scheduled Tribes (STs), highlighting initiatives taken to improve their representation in education, employment, economic opportunities and politics.
A Parliamentary Committee constituted for the welfare of Scheduled Castes and Scheduled Tribes met the Chief Minister at MCR HRD Institute in Hyderabad. The meeting was attended by committee chairman Dr. Faggan Singh Kulaste and other members.
During the interaction, Revanth Reddy explained the programmes and policy decisions undertaken by the Telangana government for the advancement of SC and ST communities.
The Chief Minister highlighted the political representation provided to Dalits, including opportunities in the positions of Legislative Assembly Speaker and ministers. He also referred to appointments and opportunities provided through the Public Service Commission and various government corporations.
Representation in Higher Education
Revanth Reddy stated that a Dalit academic had been appointed Vice-Chancellor of Osmania University, describing it as an unprecedented development in the institution’s hundred-year history.
He also referred to appointments of SC and ST candidates as Vice-Chancellors at Osmania University, Dr. B.R. Ambedkar Open University and Rajiv Gandhi University of Knowledge Technologies.
Priority in Housing and Healthcare
The Chief Minister said SC and ST communities had been given priority in the allocation of Indiramma houses.
He further stated that more than 50 per cent of the expenditure under the Chief Minister’s Relief Fund (CMRF) and Aarogyasri was being spent for the benefit of SC and ST communities.
Revanth Reddy also highlighted Telangana’s implementation of SC sub-classification, stating that the state had become the first in the country to implement the measure.
The Parliamentary Committee members appreciated the state’s implementation of SC sub-classification and the establishment of Young India Integrated Residential Schools (YIIRS), according to the Telangana CMO statement.
The meeting was attended by committee members Dr. Mallu Ravi, Tapir Gao, H.C. Meena, Anil Firojiya, Arun Kumar Sagar and Daggumalla Prasada Rao, along with MP Chamala Kiran Kumar Reddy, several MLAs and senior officials.