English News Headline
PM Narendra Modi Meets Prince and Princess of Wales; Discusses India-UK Strategic Partnership and Climate Innovation

Full Telugu News Article
న్యూఢిల్లీ: బ్రిటన్ ప్రిన్స్, ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్‌తో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఈ భేటీ సంతోషాన్నిచ్చిందని పేర్కొన్న మోదీ, ఇరు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపై ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను ప్రధాని నరేంద్ర మోదీ తన అధికారిక సామాజిక మాధ్యమ ఖాతా ద్వారా వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా వినూత్న పర్యావరణ పరిష్కారాలను ప్రోత్సహించడంలో ఎర్త్‌షాట్ ప్రైజ్ చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు.
ప్రపంచ పర్యావరణ సవాళ్లను ఎదుర్కొనేందుకు భారతదేశం అభివృద్ధి చేస్తున్న వినూత్న పరిష్కారాలు, భారతీయ ప్రతిభను అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శించడంలో ఎర్త్‌షాట్ ప్రైజ్ చేస్తున్న ప్రయత్నాలను అభినందించారు.
భారత్, బ్రిటన్ దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు మోదీ తెలిపారు.
ఇటీవల అమల్లోకి వచ్చిన సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం (CETA) ద్వారా ఏర్పడిన వేగాన్ని కొనసాగిస్తూ ఇరు దేశాల ప్రజల ఉమ్మడి అభివృద్ధి, శ్రేయస్సు కోసం మరింత కలిసి పనిచేయాలని పేర్కొన్నారు.
Full English News Article
New Delhi: Prime Minister Narendra Modi met Their Royal Highnesses, the Prince and Princess of Wales, and expressed his appreciation for their efforts in promoting innovative climate solutions across the world.
Sharing details of the meeting through his official social media account, PM Narendra Modi said it was a pleasure to meet the royal couple.
The Prime Minister appreciated the Earthshot Prize for championing innovative environmental solutions globally and showcasing Indian ingenuity in addressing major environmental challenges.
He also expressed his desire to further strengthen the Comprehensive Strategic Partnership between India and the United Kingdom.
Referring to the recently implemented Comprehensive Economic and Trade Agreement (CETA), Modi said both countries should build on the momentum of the agreement to promote shared prosperity.
He highlighted the importance of continued cooperation between India and the UK for the benefit of their people and the wider world.
The meeting also brought attention to the importance of international collaboration in addressing environmental challenges and strengthening bilateral relations.