మూడు పోలీస్ కమిషనరేట్ల సమన్వయానికి సీపీ మహేష్ భగవత్ పిలుపు

English News Headline

Hyderabad CP Mahesh Bhagwat Calls for Coordination Between Three Police Commissionerates to Ensure City Safety

Full Telugu News Article

హైదరాబాద్: నగర భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో మూడు పోలీస్ కమిషనరేట్లు పరస్పర సమన్వయంతో పనిచేయాలని హైదరాబాద్ నగర నూతన పోలీస్ కమిషనర్ డాక్టర్ మహేష్ మురళీధర్ భగవత్ సూచించారు. పోలీసుల సహాయం కోసం వచ్చే పౌరులు కమిషనరేట్ పరిధుల కారణంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకూడదని స్పష్టం చేశారు.

హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ మహేష్ మురళీధర్ భగవత్‌ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఎం. రమేష్, మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా మహేష్ భగవత్ మాట్లాడుతూ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్లు సమీప భవిష్యత్తులో మరింత సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రజలు పోలీసుల సహాయం కోసం ఏ కమిషనరేట్‌ను ఆశ్రయించినా పరిధుల సమస్యలు ఎదురుకాకుండా చూడాలని సూచించారు. మూడు కమిషనరేట్ల అధికారులు, సిబ్బంది సమష్టి కృషి, అంకితభావంతో పనిచేస్తూ తెలంగాణ పోలీస్ శాఖకు, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావడానికి కృషి చేస్తామని తెలిపారు.

నగర భద్రత, ప్రజలకు పోలీసు సేవలు అందించడంలో మూడు కమిషనరేట్ల మధ్య సమన్వయం కీలకమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

Full English News Article

Hyderabad: Hyderabad City Police Commissioner Dr. Mahesh Muralidhar Bhagwat, IPS, has called for close coordination among the Hyderabad, Cyberabad and Malkajgiri Police Commissionerates to strengthen city safety and security.

Following his assumption of charge as Hyderabad City Police Commissioner, he was paid a courtesy visit by Cyberabad Police Commissioner M. Ramesh, IPS, and Malkajgiri Police Commissioner B. Sumathi, IPS. They presented bouquets and extended their warm wishes to him.

Speaking on the occasion, Dr. Mahesh Bhagwat emphasised the importance of all three Police Commissionerates working together in close coordination to ensure the safety and security of the city in the coming days.

He stressed that citizens approaching the police for assistance should not face difficulties or jurisdiction-related issues because of the boundaries between the Commissionerates.

The Hyderabad CP further stated that through collective efforts, coordination and dedication, the three Commissionerates would work towards bringing greater recognition and a good reputation to the Telangana Police Department and the government.

His remarks highlighted the importance of inter-Commissionerate cooperation in providing seamless police services and ensuring public safety across the city.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *