యూఎస్ ఓపెన్ సూపర్-300లో రన్నరప్ కిదాంబి శ్రీకాంత్‌కు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు…

CM Revanth Reddy Congratulates Kidambi Srikanth on US Open Super 300 Runner-Up Finish

అమెరికాలో జరిగిన యూఎస్ ఓపెన్ సూపర్-300 బ్యాడ్మింటన్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన కిదాంబి శ్రీకాంత్‌ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అభినందించారు.

అమెరికాలోని కాలిఫోర్నియాలో ఇటీవల నిర్వహించిన బీడబ్ల్యూఎఫ్ (BWF) యూఎస్ ఓపెన్ సూపర్-300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో రన్నరప్‌గా నిలిచిన భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్‌ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అభినందించారు.

ఈ సందర్భంగా కిదాంబి శ్రీకాంత్ జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అంతర్జాతీయ స్థాయిలో భారత బ్యాడ్మింటన్‌కు గుర్తింపు తీసుకొచ్చిన శ్రీకాంత్ ప్రతిభను ముఖ్యమంత్రి ప్రశంసించారు.

క్రీడల్లో భారత కీర్తిని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తూ, భవిష్యత్ టోర్నమెంట్లలో మరిన్ని విజయాలు సాధించాలని ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు.


English

Telangana Chief Minister A. Revanth Reddy congratulated Indian badminton star Kidambi Srikanth for finishing runner-up at the BWF US Open Super 300 tournament held in California, USA.

Chief Minister A. Revanth Reddy congratulated Kidambi Srikanth on his impressive runner-up finish at the recently concluded BWF US Open Super 300 Badminton Tournament in California, United States.

During the occasion, Kidambi Srikanth paid a courtesy visit to the Chief Minister at his residence in Jubilee Hills. The Chief Minister appreciated Srikanth’s outstanding performance and his contribution to enhancing India’s reputation in international badminton.

He also wished the ace shuttler greater success in upcoming international tournaments and encouraged him to continue bringing laurels to the country.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *