జపాన్ ఓపెన్ సూపర్-750 విజేతగా పీవీ సింధు.. అభినందించిన రేవంత్ రెడ్డి..

PV Sindhu Wins Japan Open Super-750 Title | CM Revanth Reddy Congratulates

జపాన్ ఓపెన్ సూపర్-750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో మహిళల సింగిల్స్ టైటిల్‌ను గెలిచిన పీవీ సింధుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు.
Telangana Chief Minister Revanth Reddy congratulated PV Sindhu on winning the women’s singles title at the Japan Open Super-750 Badminton Tournament.

జపాన్‌లో జరిగిన ప్రతిష్ఠాత్మక జపాన్ ఓపెన్ సూపర్-750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ విభాగంలో టైటిల్‌ను కైవసం చేసుకున్న భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు.

కెరీర్‌లో తొలి సూపర్-750 టైటిల్‌ను సాధించడం భారత క్రీడా రంగానికి గర్వకారణమని పేర్కొన్నారు. అంతర్జాతీయ వేదికపై భారత జెండాను మరింత ఎత్తుకు తీసుకెళ్లిన సింధు విజయం దేశ యువతకు స్ఫూర్తిదాయకమని అన్నారు.

తన ప్రతిభ, కృషి, అంకితభావం, పట్టుదలతో ప్రపంచ స్థాయిలో ఎన్నో విజయాలు అందుకున్న పీవీ సింధు భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ టైటిళ్లు సాధించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

Chief Minister Revanth Reddy congratulated Indian badminton star PV Sindhu for winning the women’s singles title at the prestigious Japan Open Super-750 Badminton Tournament held in Japan.

He said that securing her maiden Super-750 title is a proud moment for Indian sports and reflects Sindhu’s remarkable dedication and excellence on the global stage.

The Chief Minister noted that Sindhu continues to inspire the youth of the country through her talent, hard work and determination, and wished her many more successes in international competitions.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *