జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా సీఎం శుభాకాంక్షలు

English News Headline

CM Revanth Reddy Greets Scientists on National Space Day

Full Telugu News Article

జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి దేశంలోని శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, సాంకేతిక నిపుణులు, ఇతర సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. అద్భుతమైన శాస్త్రీయ విజయాలతో అంతరిక్ష రంగంలో భారతదేశానికి గర్వకారణమైన స్థానం కల్పిస్తున్న ప్రతి ఒక్కరినీ అభినందించారు.

చంద్రయాన్-3 విజయాన్ని సీఎం ప్రత్యేకంగా ప్రస్తావించారు. చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో అడుగుపెట్టిన భారత్.. ప్రపంచానికి తన శాస్త్ర, సాంకేతిక సామర్థ్యాన్ని చాటిచెప్పిందని పేర్కొన్నారు.

ఈ విజయాల వెనుక ఎన్నో సంవత్సరాల కృషి, అంకితభావం, నిరంతర పరిశోధనలు ఉన్నాయని రేవంత్ రెడ్డి అన్నారు. చంద్రయాన్-3 వంటి మహత్తర విజయాల కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు.

స్టార్టప్‌లకు ప్రోత్సాహం అందించడం ద్వారా తెలంగాణ స్పేస్‌టెక్ హబ్‌గా అవతరిస్తోందని సీఎం పేర్కొన్నారు. యువత కొత్త ఆవిష్కరణల వైపు అడుగులు వేయాలని, పెద్ద కలలు కనాలని సూచించారు.

ఆ కలలను సాకారం చేసుకునే వరకు పట్టుదలతో ముందుకు సాగాలని రేవంత్ రెడ్డి యువతకు పిలుపునిచ్చారు. “విజ్ఞానమే మన బలం.. ఆవిష్కరణలే మన భవిష్యత్తు.. అంతరిక్షమే మన తదుపరి గమ్యం కావాలి” అని ఆకాంక్షించారు.

Full English News Article

Chief Minister A. Revanth Reddy extended his greetings to scientists, engineers, technical experts and other personnel who have helped India achieve a distinguished position in the space sector through remarkable scientific accomplishments on the occasion of National Space Day.

The Chief Minister highlighted the success of Chandrayaan-3, stating that India’s landing in the southern polar region of the Moon demonstrated the country’s scientific and technological capabilities to the world.

Revanth Reddy said that such achievements were made possible through years of hard work, dedication and continuous research. He expressed his appreciation to everyone who contributed to the historic success of Chandrayaan-3 and other major achievements in India’s space programme.

The Chief Minister also said Telangana is emerging as a SpaceTech hub by encouraging startups in the sector. He urged young people to pursue new innovations and encouraged them to dream big.

He called upon the youth to remain determined and continue working until their aspirations are achieved. “Knowledge is our strength, innovation is our future, and space should be our next destination,” he said.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *