పోచారంలో ‘మీ సురక్ష–సహచరి’ సమావేశం.. మహిళల భద్రతపై అవగాహన…

English: Mee Suraksha–Sahachari Meeting Held at Pocharam

మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణ, రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు పోచారం పోలీస్ స్టేషన్ పరిధిలో ‘మీ సురక్ష–సహచరి’ సమావేశం నిర్వహించారు.
English: A ‘Mee Suraksha–Sahachari’ meeting was organised in the Pocharam Police Station limits to promote awareness on women’s safety, cybercrime prevention, road safety and police-public partnership.

పోచారం పోలీస్ స్టేషన్ పరిధిలో ‘మీ సురక్ష–సహచరి’ కార్యక్రమాన్ని నిర్వహించి స్వయం సహాయక సంఘాల (SHG) సభ్యులతో పోలీసులు సమావేశమయ్యారు. మహిళల భద్రత, రోడ్డు భద్రత, సైబర్ నేరాలపై అవగాహన కల్పించడంతో పాటు పోలీసు–ప్రజల సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై చర్చించారు.

సమావేశంలో మహిళలు ఎదుర్కొంటున్న భద్రతా సమస్యలు, ఆన్‌లైన్ మోసాల నుంచి రక్షణ పొందే మార్గాలు, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, అత్యవసర పరిస్థితుల్లో పోలీసులను ఎలా సంప్రదించాలనే అంశాలపై అధికారులు వివరించారు.

ప్రజల్లో భద్రతపై అవగాహన పెంచేందుకు స్వయం సహాయక సంఘాల సభ్యులు ‘కమ్యూనిటీ సేఫ్టీ అంబాసిడర్లుగా’ పనిచేయాలని అధికారులు పిలుపునిచ్చారు. స్థానిక స్థాయిలో భద్రతా సందేశాలను ప్రజలకు చేరవేసి, అనుమానాస్పద కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో డీసీపీ సురేష్ కుమార్ (ఐపీఎస్), పోచారం ఎస్‌హెచ్‌వోతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


English Version

Police organised a ‘Mee Suraksha–Sahachari’ awareness meeting in the limits of Pocharam Police Station, interacting with members of Self-Help Groups (SHGs) on key public safety issues.

During the meeting, officials discussed women’s safety, road safety, cybercrime awareness and the importance of strengthening the relationship between the police and the public. Participants were also educated on ways to stay safe from online fraud, follow traffic rules and seek police assistance during emergencies.

Police encouraged SHG members to serve as Community Safety Ambassadors, helping spread awareness within their communities and reporting suspicious activities to law enforcement.

The programme was attended by DCP Suresh Kumar, IPS, the SHO of Pocharam Police Station, and other police personnel.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *