మనోజ్ తివారీ సంచలన ఆరోపణలు…

Former Cricketer Manoj Tiwary Alleges TMC Denied Ticket Over ₹5 Crore Demand

Full Telugu News Article

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో భారత మాజీ క్రికెటర్, బెంగాల్ మాజీ క్రీడల శాఖ సహాయ మంత్రి మనోజ్ తివారీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తనను అవమానించిందని, ఇకపై ఆ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన ప్రకటించారు.

హౌరా జిల్లాలోని శిల్‌పూర్ నియోజకవర్గం నుంచి టికెట్ ఇవ్వాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారని మనోజ్ తివారీ ఆరోపించారు. తాను ఆ మొత్తాన్ని ఇవ్వకపోవడంతోనే టికెట్ నిరాకరించారని పేర్కొన్నారు. ఈ ఆరోపణలను సోషల్ మీడియా వీడియో ద్వారా వెల్లడించారు.

బెంగాల్ క్రీడల శాఖలో పనిచేసిన సమయంలో తనకు సరైన అవకాశాలు ఇవ్వలేదని ఆయన విమర్శించారు. టీఎంసీ నేత, మాజీ మంత్రి అరూప్ బిస్వాస్ తన పనులను అడ్డుకున్నారని ఆరోపించారు. క్రీడల అభివృద్ధికి పనిచేయాలని ప్రయత్నించినప్పటికీ శాఖలో టీ, బిస్కెట్లకే పరిమితం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

యువ క్రీడాకారుల కోసం ఫుట్‌బాల్ సహా ఇతర క్రీడల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రతిపాదించినట్లు తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాత అథ్లెట్ యోహాన్ బ్లేక్‌తో కలిసి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయాలని భావించామని, రూ.5 కోట్ల ఖర్చు పేరుతో ఆ ప్రాజెక్టును నిలిపివేశారని ఆరోపించారు.

కోల్‌కతాలో జరిగిన లియోనెల్ మెస్సీ ఈవెంట్ కూడా నిర్వాహక వైఫల్యంతో విఫలమైందని ఆయన అన్నారు. భద్రతా లోపాలు, అసమర్థ నిర్వహణ కారణంగా మెస్సీ కొద్ది నిమిషాల్లోనే స్టేడియం విడిచిపెట్టారని పేర్కొన్నారు. తన ప్రజాదరణపై భయంతోనే ఆ కార్యక్రమానికి కూడా తనను ఆహ్వానించలేదని ఆరోపించారు.

ఒక క్యాబినెట్ సమావేశం అనంతరం మమతా బెనర్జీని కలిసినప్పుడు తన సమస్యలు వివరించేందుకు 20 సెకన్ల సమయం కూడా ఇవ్వలేదని మనోజ్ తివారీ చెప్పారు. ప్రజల సమస్యల కంటే వ్యక్తిగత ప్రయోజనాలకే ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపించారు.

Full English News Article

Former India cricketer and former West Bengal Minister of State for Sports Manoj Tiwary has made sensational allegations against the ruling Trinamool Congress and Chief Minister Mamata Banerjee. He stated that he no longer has any association with the party and expressed deep dissatisfaction over the treatment he allegedly received within the government.

Tiwary alleged that he was denied a party ticket from the Shibpur Assembly constituency in Howrah district because he refused to pay ₹5 crore. He made these claims in a video shared on social media, triggering political discussion in West Bengal.

The former cricketer also accused senior TMC leader and former minister Aroop Biswas of obstructing his work during his tenure in the sports department. Tiwary said he entered politics with the intention of contributing to sports development but was sidelined and not allowed to function effectively.

He claimed that proposals aimed at improving infrastructure for young football and sports players were rejected. Tiwary further alleged that a planned Centre of Excellence with world-renowned athlete Yohan Blake was shelved citing an expenditure of ₹5 crore.

Tiwary also commented on the football-related event involving Lionel Messi held in Kolkata in 2025. He alleged that poor management and security failures led to Messi leaving the stadium within minutes, calling it an embarrassment for sports lovers in the state.

The former minister further claimed that after a cabinet meeting, he tried to discuss constituency-related issues with Chief Minister Mamata Banerjee but was not even given 20 seconds to explain his concerns. He alleged that the government was prioritising personal interests over public welfare.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *