English News Headline
Konda Narasimha Reddy Assumes Charge as New Shamirpet CI in Rachakonda Commissionerate

Full Telugu News Article
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట్ పోలీస్ స్టేషన్‌కు నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్గా కొండ నరసింహారెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన పోలీసు శాఖ బదిలీలలో భాగంగా ఆయనను శామీర్‌పేట్ సీఐగా నియమించారు. ఇంతకుముందు కొండ నరసింహారెడ్డి రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సైబర్ క్రైమ్ విభాగంలో ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహించారు. మరోవైపు, ఇప్పటి వరకు శామీర్‌పేట్ సీఐగా పనిచేసిన శ్రీనాథ్‌ను రాచకొండ కమిషనరేట్ సైబర్ క్రైమ్ విభాగానికి బదిలీ చేసినట్లు సమాచారం. ఈ బదిలీలు సాధారణ పరిపాలనా ప్రక్రియలో భాగంగా జరిగినట్లు పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. పూర్తీ వివరాలు తెలియాల్సి ఉంది. ఇక పెద్ద సంఖ్యలో పోలీసు అధికారుల బదిలీలకు సంబంధించిన జాబితా సిద్ధమైనప్పటికీ, పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తూ ప్రభుత్వం పూర్తిస్థాయి జాబితాను మరోసారి సమీక్షిస్తున్నట్లు సమాచారం. సరైన ప్రాధాన్యత, సేవా రికార్డు మరియు పరిపాలనా అవసరాలను పరిగణనలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Full English News Article
Konda Narasimha Reddy on Thursday assumed charge as the new Circle Inspector (CI) of Shamirpet Police Station in Medchal-Malkajgiri district. His appointment comes as part of the latest transfer exercise undertaken by the police department.
Prior to this posting, Konda Narasimha Reddy was serving as an Inspector in the Cyber Crime Wing of the Rachakonda Police Commissionerate. Known for his experience in handling cybercrime investigations, he has now been entrusted with law and order responsibilities in Shamirpet.
Meanwhile, Srinath, who served as the Shamirpet CI until now, has reportedly been transferred to the Cyber Crime Wing under the Rachakonda Commissionerate. The transfers are understood to be part of the routine administrative reshuffle within the department.
Sources indicate that while a large-scale transfer list involving police officers has already been prepared, the government is reviewing the proposals once again. The review is said to be aimed at ensuring transparency and providing appropriate consideration based on service records and administrative requirements before issuing the final orders.