English News Headline
Minister Ponguleti Srinivas Reddy Visits Jangaon, Distributes Indiramma and 2BHK Housing Sanction Letters

పూర్తి తెలుగు వార్తా కథనం
జనగామ: జనగామ జిల్లా పర్యటనలో భాగంగా మున్సిపాలిటీకి విచ్చేసిన రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. భారీ ర్యాలీ నిర్వహించి, కళాకారుల డప్పు చప్పుళ్ల మధ్య మంత్రికి స్వాగతం పలికారు.
అనంతరం జనగామ మున్సిపాలిటీలో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు సంబంధించిన పైలాన్లను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు.
మున్సిపాలిటీలో పనిచేస్తున్న శానిటరీ వర్కర్లు, ఎలక్ట్రీషియన్లు, డ్రైవర్లకు నియామక పత్రాలను మంత్రి పంపిణీ చేశారు.
అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల గృహప్రవేశ కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారిని అభినందించడంతో పాటు ఆత్మీయ చిరుకానుకలను అందజేశారు.
అనంతరం జనగామ గ్రౌండ్‌లో నిర్వహించిన పబ్లిక్ మీటింగ్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు, 2BHK ఇళ్లకు సంబంధించిన మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
Full English News Article
Minister Ponguleti Srinivas Reddy Visits Jangaon, Distributes Housing Sanction Letters
JANGAON: Telangana Minister for Revenue, Housing and Information & Public Relations Ponguleti Srinivas Reddy received a grand welcome during his visit to Jangaon Municipality as part of his district tour.
Local Congress leaders, party workers, supporters and members of the public organised a rally to welcome the minister. Cultural artists also welcomed him with traditional drum beats.
During his visit, Minister Ponguleti Srinivas Reddy unveiled the pylons related to various development works in Jangaon Municipality.
The minister also distributed appointment letters to sanitary workers, electricians and drivers.
He later participated in housewarming ceremonies of beneficiaries of Double-Bedroom houses and presented them with small gifts.
At a public meeting held at the Jangaon Ground, Minister Ponguleti Srinivas Reddy distributed sanction letters for the second phase of Indiramma houses and 2BHK houses to eligible beneficiaries.
Local people, Congress leaders and workers, officials and housing beneficiaries attended the programme.