జనగణన 2027: ప్రజల సమాచారమే అభివృద్ధికి ఆధారం

వివరాలు వెల్లడించిన ఎనుమరెటర్లకు శిక్షణ ఇస్తున్న మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా మాస్టర్ ట్రైనర్ పి. తిరుమలేష్‌

ఆంగ్ల వార్త శీర్షిక

Census 2027: Accurate Public Information Key For National Development

దేశవ్యాప్తంగా ప్రారంభమైన జనగణన 2027 ప్రక్రియపై ప్రజల్లో ఆసక్తితో పాటు పలు సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇంటింటికి వచ్చే సర్వేయర్లు ఎవరు? ఏ వివరాలు సేకరిస్తారు? ఇచ్చే సమాచారం సురక్షితమేనా? సంక్షేమ పథకాలపై ఎలాంటి ప్రభావం ఉంటుందా? వంటి అనేక ప్రశ్నలు ప్రజల్లో వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో జనగణన 2027 సర్వే నిర్వహణలో భాగంగా ఎనుమరెటర్లకు శిక్షణ ఇస్తున్న మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా మాస్టర్ ట్రైనర్ పి. తిరుమలేష్‌ను గరుడ వార్త ప్రతినిధి సంప్రదించి పలు ప్రశ్నలకు సమాధానాలు అందించేందుకు కృషి చేస్తోంది. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన ఆయన ప్రస్తుతం అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని జనగణన సర్వే నిర్వహించే 56 మంది ఎనుమరెటర్లకు సర్వే ఏ విదంగా నిరవ్హించాలో శిక్షణ అందిచి, పర్యవేక్షిస్తున్నారు.

జనగణన 2027 ప్రక్రియ, దాని ప్రాధాన్యత, ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సేకరించే వివరాలపై ఆయన పలు ముఖ్యమైన విషయాలను మాస్టర్ ట్రైనర్ పి. తిరుమలేష్‌ వివరించారు.

“జనగణన అనేది కేవలం జనాభా లెక్కలు మాత్రమే కాదు. దేశ భవిష్యత్తు అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలకు ఇది ప్రధాన ఆధారం,” అని పి. తిరుమలేష్ తెలిపారు.

భారతదేశంలో ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే జనగణన ద్వారా ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబం, ప్రతి నివాస గృహానికి సంబంధించిన వివరాలను ప్రభుత్వం సేకరిస్తుంది. ఈ గణాంకాల ఆధారంగానే భవిష్యత్తులో పాఠశాలలు, ఆసుపత్రులు, రోడ్లు, తాగునీటి సదుపాయాలు, సంక్షేమ పథకాలు వంటి అభివృద్ధి కార్యక్రమాలు రూపుదిద్దుకుంటాయి.

ఈసారి జనగణనకు ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరుగుతున్న తొలి పూర్తి స్థాయి జనగణన కావడంతో పాటు, మొదటిసారిగా డిజిటల్ విధానంలో నిర్వహిస్తున్నారు. అదేవిధంగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ విధానాన్ని కూడా ప్రవేశపెట్టారు. దీని ద్వారా పౌరులు తమ వివరాలను తామే ఆన్లైన్‌లో నమోదు చేసుకునే అవకాశం కల్పించారని తెలిపారు.

“డిజిటల్ విధానం వల్ల సమాచారం మరింత ఖచ్చితంగా, వేగంగా నమోదు చేయడం సాధ్యమవుతుంది,” అని తిరుమలేష్ పేర్కొన్నారు.

జనగణన తొలి దశగా హౌస్ లిస్టింగ్ అండ్ హౌసింగ్ జనగణన ప్రక్రియ కొనసాగుతోంది. ఈ దశలో ప్రతి ఇంటి పరిస్థితులు, కుటుంబ సభ్యుల వివరాలు, తాగునీరు, విద్యుత్, పారిశుధ్యం, ఇంటర్నెట్, వంట ఇంధనం, వాహనాలు వంటి అనేక అంశాలపై సమాచారం సేకరిస్తున్నారన్నారు.

ఇంటి రకం, గదుల సంఖ్య, కుటుంబ సభ్యుల సంఖ్య, మహిళా కుటుంబ అధిపతి ఉన్నారా?, తాగునీటి వనరు ఏది?, మరుగుదొడ్డి సౌకర్యం ఉందా?, విద్యుత్ కనెక్షన్ ఉందా? వంటి అంశాలతో పాటు మొత్తం 34 రకాల ప్రశ్నల ద్వారా సమాచారం నమోదు చేస్తున్నారన్నారు.

ప్రజల్లో వ్యక్తిగత సమాచారం గోప్యతపై కూడా అనేక సందేహాలు ఉన్నాయి. దీనిపై స్పందించిన తిరుమలేష్, “జనగణనలో ఇచ్చే సమాచారం పూర్తిగా గోప్యంగా భద్రపరచబడుతుంది. ఈ వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్వినియోగం చేయరు. సంక్షేమ పథకాల తొలగింపుతో దీనికి ఎలాంటి సంబంధం లేకుకండా ప్రబుత్వం పటిష్ట చరియలు తెస్సుకున్నట్లుగా తెలిపారు.

అదేవిధంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా ఆయన సూచించారు.

“ప్రభుత్వం నియమించిన అధికారిక ఎనుమరెటర్లకు మాత్రమే వివరాలు ఇవ్వాలన్నారు. గుర్తింపు కార్డులు లేని వ్యక్తులను నమ్మకూడదు. అనుమానాస్పద వ్యక్తుల విషయంలో వెంటనే స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వాలి,” అని ప్రజలకు సూచించారు.

ఎనుమరెటర్లు ఇంటింటికి వెళ్లే వివరాలు సేకరించేటపుడు ప్రజలు సరైన వివరాలు అందించాలని, సహకరించాలని ఆయన కోరారు.

“ప్రజలు ఇచ్చే ఖచ్చితమైన సమాచారమే ప్రభుత్వానికి సరైన అభివృద్ధి ప్రణాళికలు రూపొందించేందుకు ఉపయోగపడుతుంది. సమగ్ర అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం చాలా అవసరం,” అని తిరుమలేష్ తెలిపారు.

దేశ భవిష్యత్తు అభివృద్ధికి దిశానిర్దేశం చేసే ఈ మహత్తర కార్యక్రమంలో ప్రతి పౌరుడు బాధ్యతగా భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉందని మాస్టర్ ట్రైనర్ పి. తిరుమలేష్‌ సూచిస్తున్నారు.

Full English Feature Story

Census 2027 has officially begun across the country, creating both curiosity and questions among the public. Many citizens are asking who the surveyors are, what details are being collected, whether the information is secure, and whether welfare schemes will be affected in any way.

In this context, Garuda Vartha approached P. Tirumalesh, District Master Trainer for Census 2027 in Medchal-Malkajgiri district. A school teacher by profession, he is currently training teachers who are conducting census survey operations in the Aliabad Municipality area.

Explaining the importance of Census 2027, Tirumalesh said the exercise is not merely about population counting but serves as the foundation for future national development planning.

The census collects detailed information about individuals, families, housing conditions, drinking water, sanitation, electricity, education, and digital access. Governments use this data to plan schools, hospitals, roads, welfare schemes, and public infrastructure.

This Census is considered particularly important because it is the first full-scale census after the formation of Telangana state and is also being conducted through digital methods. For the first time, self-enumeration facilities are also being introduced, allowing citizens to submit details online themselves.

Tirumalesh clarified that all information collected during the census process would remain completely confidential and would not be misused under any circumstances. He also advised people to share details only with officially authorised surveyors carrying valid identity cards.

He appealed to the public to cooperate fully with survey teams and provide accurate information so that governments can prepare better development plans for the future.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *