తెలంగాణ యువతే భవిష్యత్తు: రేవంత్ రెడ్డి…

Revanth Reddy’s Message on International Youth Day

అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి యువతకు శుభాకాంక్షలు తెలిపారు. యువతకు విద్య, నైపుణ్యాలు, ఉపాధి, క్రీడలు, నాయకత్వ అవకాశాలు కల్పిస్తే బలమైన భవిష్యత్తును నిర్మించవచ్చని అన్నారు.

యువత ఆలోచనలకు ప్రోత్సాహం, ప్రతిభకు వేదిక, ప్రయత్నాలకు అవసరమైన వనరులు అందిస్తే అసాధ్యాలను సుసాధ్యం చేయగలరని రేవంత్ రెడ్డి అన్నారు. పేదరికం, అసమానతలు, నిరుద్యోగం, వాతావరణ మార్పులు, సాంకేతిక పరిజ్ఞానంలోని అంతరాలు వంటి సవాళ్లను అధిగమించేందుకు యువతకు అవకాశాలు, వనరులు, నైపుణ్యాలు అందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని పేర్కొన్నారు.

యువతకు సరైన విద్య, నైపుణ్యాభివృద్ధి, క్రీడలు, ఉపాధి, నాయకత్వ అవకాశాలు కల్పించినప్పుడే బంగారు భవిష్యత్తును నిర్మించగలమని ముఖ్యమంత్రి అన్నారు. ప్రజా ప్రభుత్వం యువతకు అండగా నిలుస్తోందని తెలిపారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా వైట్ కాలర్ ఉద్యోగాలు సవాళ్లను ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో, బ్లూ కాలర్ ఉద్యోగాలను అందిపుచ్చుకునేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని రేవంత్ రెడ్డి తెలిపారు. భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనే దిశగా ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించిన ఏటీసీలు, స్కిల్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ వంటి కార్యక్రమాలు మంచి ఫలితాలు అందిస్తున్నాయని చెప్పారు.

టామ్‌కామ్ ద్వారా సింగపూర్, జపాన్, జర్మనీ వంటి దేశాల్లో యువతకు ఉపాధి అవకాశాలు లభించేలా అవసరమైన చర్యలు చేపట్టామని ముఖ్యమంత్రి తెలిపారు. యువత వ్యసనాలకు బారిన పడకుండా, ముఖ్యంగా మాదకద్రవ్యాల నియంత్రణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని అన్నారు.

యువత స్పష్టమైన లక్ష్యాలను ఎంచుకుని ముందుకు సాగాలని రేవంత్ రెడ్డి సూచించారు. యువతే మన బలం, యువతే మన భవిష్యత్తు అని పేర్కొంటూ అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.


English

Chief Minister A. Revanth Reddy extended his greetings to the youth on International Youth Day, saying that providing education, skills, employment, sports and leadership opportunities would help build a stronger future.

Revanth Reddy said young people can achieve the seemingly impossible when their ideas are encouraged, their talent is given a platform and they receive the resources needed to pursue their goals. He said everyone has a responsibility to provide opportunities, resources and skills to help youth address challenges such as poverty, inequality, unemployment, climate change and technological gaps.

The Chief Minister said a bright future can be built by ensuring proper education, skill development, sports, employment and leadership opportunities for young people. He said the state government was committed to supporting the youth.

He said the government was taking steps to help young people access blue-collar employment opportunities as artificial intelligence poses challenges to some white-collar jobs. Initiatives such as ATCs, the Skills University and the Sports University have already been launched to prepare youth for future challenges and are producing positive results, he said.

Revanth Reddy said necessary measures had been taken through TOMCOM to help young people secure employment opportunities in countries such as Singapore, Japan and Germany. He added that the state government was taking strict measures to control drugs and prevent young people from falling into addiction.

The Chief Minister urged the youth to set clear goals and move forward with determination. Describing the youth as the strength and future of the state, he extended his greetings on International Youth Day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *