వెయ్యి గ్రామాలు దాటిన భూ రీసర్వే.. మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు

English News Headline

Telangana Land Resurvey Crosses 1,000 Villages; Minister Ponguleti Srinivasa Reddy Directs Officials to Speed Up Process

Full Telugu News Article

తెలంగాణలో సమగ్ర భూ రీసర్వే 1,000 గ్రామాల మైలురాయిని దాటింది. ఇప్పటివరకు 416 గ్రామాల్లో సర్వే ప్రక్రియ పూర్తయింది. భూ యజమానులకు స్పష్టమైన హక్కులు కల్పించడమే లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు.

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో భూ రీసర్వే పురోగతిపై రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో సర్వే సమయంలో ఎదురవుతున్న సమస్యలు, రైతుల నుంచి వస్తున్న స్పందన, సాంకేతిక అంశాలు, సర్వే సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందులపై సమగ్రంగా చర్చించారు.

సర్వేలో పాల్గొంటున్న సిబ్బందితో మంత్రి స్వయంగా ఫోన్‌లో మాట్లాడి క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకున్నారు. సమగ్ర భూ రీసర్వేను పారదర్శకంగా, శాస్త్రీయంగా, పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. భూ యజమానుల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10,954 రెవెన్యూ గ్రామాలు ఉండగా, తొలిదశలో హైదరాబాద్ మినహా మిగిలిన 32 జిల్లాల్లో రీసర్వే నిర్వహిస్తున్నారు. ఒక్కో జిల్లాకు 70 గ్రామాల చొప్పున, మ్యాపులు లేని గ్రామాలను కూడా కలుపుకొని మొత్తం 2,720 గ్రామాలను ఎంపిక చేశారు. వీటిలో ఇప్పటివరకు 1,000 గ్రామాల్లో సర్వే చేపట్టగా, 416 గ్రామాల్లో ప్రక్రియ పూర్తయింది.

సర్వే పూర్తయిన గ్రామాల్లో సంబంధిత భూ యజమానులకు తప్పనిసరిగా నోటీసులు జారీ చేయాలని మంత్రి పొంగులేటి సూచించారు. వారి నుంచి అభ్యంతరాలను స్వీకరించి, నిబంధనల ప్రకారం పరిష్కరించాలని ఆదేశించారు. రీసర్వేలో గుర్తించిన చిన్నచిన్న పొరపాట్లు, లోపాలను వెంటనే సరిదిద్దాలని స్పష్టం చేశారు.

అలాగే, సర్వే పూర్తయిన గ్రామాల్లో ప్రతి భూమికి ఆధార్ నంబర్ తరహాలో ప్రత్యేక గుర్తింపునిచ్చే భూధార్ నంబర్ కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.

భూ రీసర్వే పురోగతిపై బుధవారం జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, సర్వే శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లతో ప్రత్యేక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని మంత్రి సూచించారు.

భవిష్యత్తులో భూ వివాదాలు లేని తెలంగాణను నిర్మించడంతో పాటు ప్రతి భూ యజమానికి తన భూమిపై స్పష్టమైన హక్కులు కల్పించడమే సమగ్ర భూ రీసర్వే ప్రధాన లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.

Full English News Article

Telangana’s comprehensive land resurvey programme has crossed the 1,000-village milestone, with surveys completed in 416 villages so far. Revenue Minister Ponguleti Srinivasa Reddy has directed officials to accelerate the programme to ensure accurate land boundaries and clear ownership rights for landholders.

Minister Ponguleti Srinivasa Reddy conducted a review meeting with senior Revenue Department officials at Dr. B.R. Ambedkar Telangana State Secretariat to assess the progress of the land resurvey.

The discussions covered field-level challenges, farmers’ feedback, technical issues and difficulties faced by survey personnel. The Minister also spoke directly with survey staff over the phone to understand the situation on the ground.

He directed officials to conduct the comprehensive land resurvey in a transparent, scientific and systematic manner, giving priority to the opinions and concerns of landowners.

Telangana has a total of 10,954 revenue villages. In the first phase, 2,720 villages have been selected across 32 districts, excluding Hyderabad. The selection includes 70 villages per district, along with villages that do not have existing maps.

Of these 2,720 villages, survey operations have commenced in 1,000 villages, while the process has been completed in 416 villages.

Minister Ponguleti Srinivasa Reddy instructed officials to issue mandatory notices to landowners after completion of the resurvey and invite objections. All objections must be examined and resolved according to the applicable rules.

He also directed officials to rectify minor errors and discrepancies immediately and speed up the allocation of unique BhuDhaar numbers to individual land parcels, similar to Aadhaar identification numbers.

The Minister further instructed officials to organise a special video conference on Wednesday with District Collectors, Additional Collectors, Revenue Divisional Officers and Assistant Directors of the Survey Department to review progress and discuss the precautions required during the resurvey.

The programme aims to provide clear land ownership rights and work towards a Telangana free from land disputes in the future.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *