English News Headline
Grand Annadanam Held at Sri Vishnu and Shiva Temple in Shamirpet

Full Telugu News Article
శామీర్‌పేట మండలం మూడు చింతలపల్లి మున్సిపల్ పరిధిలోని ఉద్దమర్రి అక్కన్న మాదన్నల నాటి శ్రీ విష్ణు, శివాలయంలో శనివారం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో భక్తుల రద్దీ నెలకొంది.
ఈ సందర్భంగా నాగారం ప్రాంతానికి చెందిన రామిడి శ్రీనివాస్ రెడ్డి – అలివేలు మంగమ్మ దంపతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆలయం వద్ద అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఆలయానికి విచ్చేసిన భక్తులతో పాటు రహదారిపై ప్రయాణించే భక్తులు కూడా అన్నప్రసాదాన్ని స్వీకరించారు. భక్తులకు భక్తి భావంతో సేవ చేయడం ఆనందంగా ఉందని నిర్వాహకులు తెలిపారు.
ప్రత్యేక పూజలు, అన్నదానం కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య సాగింది. ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడాయి.
Full English News Article
A grand Annadanam (food distribution) programme was organised on Saturday at the historic Sri Vishnu and Shiva Temple located in Moodu Chintalpally municipal limits of Shamirpet mandal. Special pujas were also performed at the temple, attracting a large number of devotees.
The Annadanam was conducted by Ramidi Srinivas Reddy and Alivelu Mangamma from Nagaram area along with their family members as a devotional offering at the temple premises.
Devotees visiting the temple as well as people passing by on the road received the prasadam. Organisers said serving devotees through Annadanam brought them spiritual satisfaction and happiness.
The special pujas and food distribution were carried out in a devotional atmosphere. Temple committee members and local devotees participated in large numbers and made the programme successful.
The temple surroundings remained spiritually vibrant throughout the event with active participation from devotees and committee members.