నల్లగొండ జిల్లాలో ఎమ్మెల్సీ ఓటర్లకు డబ్బులు పంపిణీ

నార్కట్ పల్లె లోని డోకూరు ఫంక్షన్ హాల్ లో ఓ పార్టీ కి చెందిన వ్యక్తులు డబ్బులు పంచుతున్నారని అడ్డుకునేందుకు వెళ్లిన అశోక్ పై సదరు పార్టీ నేతల దాడి…

వీడియో రికార్డు చేస్తున్న కెమెరాలు ధ్వంసం, ఫోన్లు ధ్వంసం…

ఎమ్మెల్సీ అభ్యర్థి అశోక్ పై దాడి

పోలీసులను ఆశ్రయించిన బాధితుడు…

సదరు బాధితుడికి రక్షణగా రక్షక భటుని నియమించిన పోలీసులు…

నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి మండల కేంద్రంలోని డోకూరు పంక్షన్ హాలులో ఓ పార్టీ నేతలు గ్రాడ్యుయేట్ ఓటర్లకు డబ్బులు పంచుతుండగా అశోక్ పట్టుకున్నారు. దీంతో సదరు పార్టీ కార్యకర్తలు నువ్వు ఎవరంటూ అశోక్ పై దాడి చేశారు. దీన్ని చిత్రీకరిస్తున్న వ్యక్తులపై కూడా కార్యకర్తలు దాడి చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *