సైబరాబాద్ కమిషనరేట్‌లో కాలోజీ జయంతి వేడుకలు…

సైబరాబాద్ కమిషనరేట్‌లో కాలోజీ జయంతి వేడుకలు | Kaloji

సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌లో ప్రజాకవి కాలోజీ నారాయణరావు జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. పోలీసు కమిషనర్‌ డాక్టర్‌ యం. రమేష్‌ కాలోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

తెలంగాణ భాష, యాస, సంస్కృతికి కాలోజీ నారాయణరావు అందించిన సేవలను ఈ సందర్భంగా అధికారులు, పోలీసు సిబ్బంది స్మరించుకున్నారు. ప్రజల భాషలో ప్రజల సమస్యలను తన రచనల్లో ప్రతిబింబించిన కాలోజీ, తెలంగాణ ప్రజల జీవన విధానం, కష్టాలు, ఆకాంక్షలకు తన కలంతో గొంతుకగా నిలిచారని సీపీ రమేష్‌ పేర్కొన్నారు.

సామాజిక రుగ్మతలు, అన్యాయాలు, అసమానతలపై తనదైన శైలిలో స్పందిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి కాలోజీ చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. తెలంగాణ భాషకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంలో ఆయన పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు.

తెలంగాణ యాస, ప్రజల నుడికారాన్ని సాహిత్యంలో గౌరవప్రదంగా నిలిపిన కాలోజీ రచనలు నేటి తరానికి కూడా స్ఫూర్తిదాయకమని సీపీ రమేష్‌ తెలిపారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలను అర్థం చేసుకుని స్పందించే తత్వాన్ని కాలోజీ నుంచి ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.

ప్రజలతో మరింత సన్నిహితంగా పనిచేసి వారి సమస్యలకు పరిష్కారం చూపే క్రమంలో ప్రజా భాష, ప్రజల భావోద్వేగాలను అర్థం చేసుకోవడం పోలీసు శాఖకు ఎంతో ముఖ్యమని అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో సైబరాబాద్‌ కమిషనరేట్‌కు చెందిన పలువురు పోలీసు ఉన్నతాధికారులు, అధికారులు, సిబ్బంది పాల్గొని కాలోజీకి ఘనంగా నివాళులర్పించారు.

Cyderabad Commissionerate Observes Kaloji Narayana Rao’s Birth Anniversary

The birth anniversary of renowned Telangana poet and social activist Kaloji Narayana Rao was observed with due respect at the Cyberabad Police Commissionerate on Wednesday. Cyberabad Police Commissioner Dr. M. Ramesh, IPS, paid floral tributes to Kaloji’s portrait.

Police officials and personnel recalled Kaloji’s significant contribution to Telangana’s language, dialect and culture. Commissioner Ramesh said Kaloji used the language of the people to reflect their problems in his writings and gave voice to their lives, struggles and aspirations.

He said Kaloji’s efforts to create social awareness through his writings against social evils, injustice and inequality would remain memorable. His contribution to giving Telangana language a distinct identity was also highlighted.

Officials noted that Kaloji’s writings, which gave dignity to the Telangana dialect and the expressions used by ordinary people, continue to inspire the younger generation. Commissioner Ramesh encouraged everyone to draw inspiration from Kaloji’s approach of engaging closely with people, understanding their concerns and responding to their problems.

Officials also emphasised that understanding people’s language and emotions is important for the police department to work more closely with the public and effectively address their concerns. Several senior police officers, officials and personnel from the Cyberabad Commissionerate participated in the programme and paid tributes to Kaloji.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *