హైకోర్టు జడ్జి ప్రశంసలు.. పోలీస్ బృందానికి రివార్డు | Malkajgiri Police

గౌరవ హైకోర్టు న్యాయమూర్తి మౌషుమీ భట్టాచార్య ప్రశంసలు అందుకున్న మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ మహిళా ఎస్ఐ ఎస్కే. రెహానా, ఆమె బృందాన్ని కమిషనర్ బి. సుమతి అభినందించి రివార్డు అందజేశారు.
జ్యుడీషియల్, పోలీస్ అధికారుల సమావేశంలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి మౌషుమీ భట్టాచార్యకు నిర్వహించిన గార్డ్ ఆఫ్ ఆనర్ కార్యక్రమంలో మల్కాజ్గిరి పోలీసుల బృందం ప్రదర్శించిన క్రమశిక్షణ, సమన్వయాన్ని న్యాయమూర్తి ప్రశంసించారు.
ఈ సందర్భంగా మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి, ఐపీఎస్.. మహిళా ఎస్ఐ ఎస్కే. రెహానా, ఆమె బృందాన్ని అభినందించారు. న్యాయమూర్తి నుంచి ప్రశంసలు అందుకున్న బృందానికి రివార్డు అందజేశారు.
English
Telangana High Court Judge Moushumi Bhattacharya appreciated the Malkajgiri Police team for its disciplined Guard of Honour during the Judicial and Police Officers’ Conference. Malkajgiri Police Commissioner B. Sumathi, IPS, congratulated Woman SI S.K. Rehana and her team and rewarded them for their performance.
The police team received appreciation for the Guard of Honour presented to Justice Moushumi Bhattacharya during the conference of judicial and police officers. The recognition highlighted the team’s discipline and professional conduct.
Malkajgiri Police Commissioner B. Sumathi, IPS, appreciated Woman SI S.K. Rehana and her team for earning the appreciation of the High Court Judge and presented a reward to the team.