మూడు చింతలపల్లిలో భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు…

Bonalu Celebrated in Moodu Chinthalapalli

మూడు చింతలపల్లిలో భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు

మూడు చింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలో బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ మొక్కులు తీర్చుకున్నారు.

శామీర్‌పేట, ఆగస్టు 6: శామీర్‌పేట మండలంలోని మూడు చింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలో గురువారం బోనాల పండుగను వైభవంగా నిర్వహించారు. భక్తులు బోనాలను ఊరేగింపుగా తీసుకువెళ్లి అమ్మవారికి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ జాము రవి, స్థానిక కౌన్సిలర్ ర్యాకల నీరజ్ గౌడ్ అమ్మవారికి బియ్యం సమర్పించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖశాంతులు, సిరిసంపదలతో ఉండాలని ప్రార్థించారు.

అనంతరం భక్తులను కలిసి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకట గోపాల్, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


English

Bonalu Celebrated with Devotion in Moodu Chinthalapalli

Bonalu festival was celebrated with religious fervour in Moodu Chinthalapalli Municipality. Devotees offered Bonam to the Goddess, performed special prayers and fulfilled their vows.

Shamirpet, August 6: Bonalu celebrations were held with devotion and enthusiasm in the limits of Moodu Chinthalapalli Municipality on Thursday. Devotees carried Bonam in a traditional procession and offered it to the presiding Goddess.

On the occasion, Municipal Chairman Jamu Ravi and local Councillor Ryakala Neeraj Goud offered rice to the Goddess and participated in special prayers. They prayed for the health, peace and prosperity of the people.

Later, they greeted devotees and conveyed Bonalu festival wishes. Municipal Commissioner Venkata Gopal, local public representatives, party leaders and a large number of devotees participated in the celebrations.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *