₹25 Lakh Sanctioned for Gopalapuram Government Primary School

ఖమ్మం: గోపాలపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శిథిలావస్థలో ఉన్న గదుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.25 లక్షలు మంజూరు చేసింది. Khammam: The Telangana Government has sanctioned ₹25 lakh for the construction of new classrooms at Gopalapuram Government Primary School after concerns over its dilapidated infrastructure.
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం గోపాలపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శిథిలావస్థకు చేరుకున్న తరగతి గదుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.25 లక్షలు మంజూరు చేసింది. పాఠశాల పరిస్థితులపై ఒక తెలుగు దినపత్రికలో ప్రచురితమైన కథనానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ టీఎస్ దివాకర్ పాఠశాలను వెంటనే సందర్శించి, మౌలిక వసతుల కల్పనకు అవసరమైన చర్యలు చేపట్టారు. పాఠశాల అభివృద్ధికి కృషి చేసిన ఉపాధ్యాయిని నిమ్మతోట ఇందిరను కలెక్టర్ అభినందించారు.
ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్. శ్రీధర్ పాఠశాల ఉపాధ్యాయినితో ఫోన్‌లో మాట్లాడి అక్కడి పరిస్థితులపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం పాఠశాలలో కొత్త గదుల నిర్మాణానికి రూ.25 లక్షల నిధులను విడుదల చేయాలని నిర్ణయించారు.
ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో కొత్త తరగతి గదుల నిర్మాణం చేపట్టి విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించనున్నారు. ఈ నిర్ణయంతో పాఠశాల మౌలిక వసతులు బలోపేతం కానున్నాయి.
English
The Telangana Government has sanctioned ₹25 lakh for the construction of new classrooms at Gopalapuram Government Primary School in Tirumalayapalem mandal of Khammam district after reports highlighted the poor condition of the existing school building.
Chief Minister Revanth Reddy took note of the issue following a newspaper report and directed officials to immediately inspect the school and provide the required infrastructure.
Acting on the Chief Minister’s instructions, Khammam District Collector T.S. Divakar visited the school and appreciated teacher Nimmathota Indira for her efforts towards the school’s development. The Collector announced the release of ₹25 lakh for the construction of new classrooms.
The Chief Minister’s Principal Secretary, N. Sridhar, also spoke with the teacher to understand the ground situation. The sanctioned funds will be used to improve infrastructure and provide students with a safer and better learning environment