Revanth Reddy Meets US Ambassador Sergio Gor | Telangana-US Relations & Visa Talks
లంగాణ–అమెరికా సంబంధాల బలోపేతంపై చర్చలు | Telangana CM and US Ambassador Discuss Stronger Bilateral Ties

హైదరాబాద్: అమెరికా రాయబారి సెర్జియో గోర్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమై వీసాల అంశం, తెలంగాణ–అమెరికా సంబంధాల విస్తరణపై చర్చించారు. Hyderabad: Telangana Chief Minister Revanth Reddy met US Ambassador Sergio Gor to discuss visa-related matters and strengthening ties between Telangana and the United States.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో భారత్‌లోని అమెరికా రాయబారి సెర్జియో గోర్‌తో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వీసాలకు సంబంధించిన అంశాలతో పాటు తెలంగాణ–అమెరికా సంబంధాలను వివిధ రంగాల్లో మరింత బలోపేతం చేసే అంశాలపై ఇరువురు విస్తృతంగా చర్చించారు.
సమావేశంలో అమెరికాలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న భాషల్లో తెలుగు ఒకటిగా నిలుస్తోందని ముఖ్యమంత్రి ప్రస్తావించారు. అమెరికాలోని తెలుగు సమాజం రెండు ప్రాంతాల మధ్య సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తోందని పేర్కొన్నారు.
రాయబారి సెర్జియో గోర్ మాట్లాడుతూ తెలంగాణ–అమెరికా సంబంధాలను పెట్టుబడులు, వాణిజ్యం, విద్య, సాంకేతికత, ఆవిష్కరణలు తదితర అన్ని రంగాల్లో మరింత విస్తరించేందుకు అవసరమైన సంపూర్ణ సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు ఆప్త మిత్రుడిగా నిలుస్తున్నందుకు సెర్జియో గోర్‌కు రాష్ట్ర ప్రజల తరఫున ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో పరస్పర సహకారాన్ని మరింతగా పెంపొందించేందుకు ఇరు పక్షాలు సానుకూలంగా స్పందించాయి.
English
Telangana Chief Minister Revanth Reddy held a courtesy meeting with US Ambassador to India Sergio Gor in Hyderabad. The two leaders discussed visa-related issues and explored ways to further strengthen cooperation between Telangana and the United States across multiple sectors.
During the meeting, the Chief Minister highlighted that Telugu is among the fastest-growing languages in the United States. He noted that the Telugu community has been playing a significant role in strengthening cultural, social and economic ties between Telangana and the US.
Ambassador Sergio Gor assured the Chief Minister of full support in expanding Telangana–US cooperation in areas such as investment, trade, education, technology and innovation.
The Chief Minister thanked the Ambassador on behalf of the people of Telangana for being a close friend of the state and expressed hope for stronger collaboration in the years ahead.