కొడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి రెండు రోజుల పర్యటన.. ఎడ్యుకేషన్ హబ్‌పై సమీక్ష

English: CM Revanth Reddy to Review Kodangal Education Hub During Two-Day Visit

Lead: ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రెండు రోజుల పాటు వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించి ఎడ్యుకేషన్ హబ్ పనులతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించనున్నారు. | Lead: Chief Minister A. Revanth Reddy will undertake a two-day visit to Kodangal Assembly constituency in Vikarabad district to review the Education Hub project and other development works.

ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రేపటి నుంచి రెండు రోజుల పాటు వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో దుద్యాల్ మండలం హకీంపేటలో నిర్మాణంలో ఉన్న ఎడ్యుకేషన్ హబ్ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు.

అనంతరం సంబంధిత అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించి ప్రాజెక్టు పురోగతి, మౌలిక సదుపాయాల అభివృద్ధి, తదుపరి కార్యాచరణపై చర్చించనున్నారు.

మొదటి రోజు రాత్రి కొడంగల్‌లో బస చేయనున్న ముఖ్యమంత్రి, మరుసటి రోజు (22వ తేదీ) నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించనున్నారు. అలాగే SIR అమలు కొనసాగుతున్న తీరును కూడా పరిశీలించనున్నారు.

సమీక్ష సమావేశాల అనంతరం మధ్యాహ్నం తర్వాత ముఖ్యమంత్రి హైదరాబాద్‌కు తిరిగి బయలుదేరనున్నారు.

Chief Minister A. Revanth Reddy will begin a two-day visit to Kodangal Assembly constituency in Vikarabad district from tomorrow. During the visit, he will conduct a field inspection of the ongoing works at the Education Hub in Hakeempet village of Dudyal Mandal.

He will later chair a high-level review meeting with officials to assess the project’s progress, infrastructure development and future course of action.

The Chief Minister will stay overnight in Kodangal. On the following day (July 22), he will review various development works being implemented in the constituency and examine the progress of the SIR programme.

After completing the review meetings, he will leave for Hyderabad on Wednesday afternoon.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *