English News Headline
TS SSC 10th Results 2026 to Be Released Today at 2 PM in Telangana

తెలంగాణలో పదో తరగతి (ఎస్ఎస్సీ) ఫలితాలు నేడు మధ్యాహ్నం 2 గంటలకు విడుదల కానున్నాయి. రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) ప్రాంగణంలోని గోదావరి ఆడిటోరియంలో ఫలితాలను అధికారికంగా ప్రకటించనున్నారు.
ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ సమక్షంలో ఫలితాల విడుదల కార్యక్రమం జరగనుంది. ఈసారి విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా మార్కులు అందుబాటులో ఉంచనున్నారు.
విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్సైట్లు అయిన results.bsetelangana.org మరియు results.bse.telangana.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు. అదనంగా కొన్ని గుర్తింపు పొందిన డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో కూడా ఫలితాలు అందుబాటులో ఉంటాయి.
వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలు తెలుసుకునే అవకాశం కల్పించారు. ఇందుకోసం 80969 58096 నంబర్‌కు వాట్సాప్‌లో ‘Hi’ అని పంపి, తరువాత ‘SSC Results’ అని టైప్ చేసి, హాల్‌టికెట్ నంబర్ నమోదు చేస్తే ఫలితాల వివరాలు అందుతాయి.
తెలంగాణలో మార్చి 14 నుంచి పదో తరగతి ప్రధాన పరీక్షలు ప్రారంభమై ఈ నెల 13న పూర్తయ్యాయి. ఈసారి సుమారు 5.15 లక్షల మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షలు రాయగా, 10 వేల మందికి పైగా సప్లిమెంటరీ విద్యార్థులు కూడా హాజరయ్యారు.
ఈ నెల 23వ తేదీతో జవాబుపత్రాల మూల్యాంకనం పూర్తయ్యింది. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు నేడు ఫలితాలను విడుదల చేయడానికి సిద్ధమయ్యారు.
ఫలితాల కోసం విద్యార్థులు అధికారిక వెబ్సైట్లను మాత్రమే ఉపయోగించాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. అనధికారిక లింకులు, ఫేక్ వెబ్సైట్లపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
Full English News Article
The Telangana SSC Class 10 Results 2026 will be released today at 2 PM, bringing relief and anticipation to lakhs of students across the state. The results will be officially announced at the Godavari Auditorium located in the SCERT campus.
Government Advisor K. Keshava Rao, Education Department Secretary Yogita Rana, and School Education Director Naveen Nicolas will participate in the result declaration event. This year, students will receive subject-wise marks instead of only grade-based results.
Students can check their results through the official websites results.bsetelangana.org and results.bse.telangana.gov.in. The results will also be accessible through select recognized digital platforms.
The School Education Department has also enabled WhatsApp access for result checking. Students need to send “Hi” to 80969 58096 on WhatsApp, then type “SSC Results,” followed by entering their hall ticket number to receive their marks details.
The Telangana SSC main examinations began on March 14 and concluded on April 13. Around 5.15 lakh regular students appeared for the exams, while more than 10,000 supplementary candidates also attended.
Evaluation of answer sheets was completed on April 23. Officials have completed all preparations for the smooth release of the results this afternoon.
Education department officials advised students to use only official websites for checking results and warned them against fake links and unauthorized portals that may mislead students during result time.