Chiranjeevi Birthday Wishes to Pawan Kalyan

సంకల్ప సాధకుడు కళ్యాణ్ బాబు.. ప్రజాసేవలో మరింత విజయాలు సాధించాలి: చిరంజీవి
నిబద్ధత, బాధ్యత, ప్రజలకు మేలు చేయాలనే సంకల్పంతో పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారని సినీ నటుడు చిరంజీవి పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గ్రామీణాభివృద్ధి, గిరిజన ప్రాంతాల అభ్యున్నతి, పర్యావరణ పరిరక్షణ, ప్రజల మౌలిక అవసరాల కోసం ఆయన చేస్తున్న కృషి తనకు ఆనందం, గర్వాన్ని కలిగిస్తోందని తెలిపారు.
చిన్నప్పటి నుంచే పవన్ కళ్యాణ్‌లో నిబద్ధతతో కూడిన ప్రేమ, బాధ్యతతో కూడిన సంకల్పం, ప్రజలకు మంచి చేయాలనే చిత్తశుద్ధిని చూస్తున్నానని చిరంజీవి అన్నారు. తాను చేపట్టే ప్రతి పనిలో పూర్తిగా నిమగ్నమవుతూ, ప్రతి అడుగు పదిమందికి మేలు చేయాలనే తపనతో వేస్తారని పేర్కొన్నారు.
తన కుటుంబంపై ఎంత ప్రేమ చూపిస్తారో, తనను నమ్మిన ప్రజలపైనా అంతే ప్రేమ, వాత్సల్యాన్ని పవన్ కళ్యాణ్ చూపిస్తారని చిరంజీవి అన్నారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గ్రామాల అభివృద్ధి, గిరిజన ప్రాంతాల అభ్యున్నతి, పర్యావరణ పరిరక్షణ, ప్రజల మౌలిక అవసరాల కల్పన కోసం అంకితభావంతో పనిచేస్తూ పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారని పేర్కొన్నారు.
ఏళ్లుగా పరిష్కారం కాని అనేక సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపిస్తూ అభివృద్ధిని మారుమూల ప్రాంతాలకు సైతం తీసుకువెళ్తున్న తీరు తనకు ఆనందాన్ని, గర్వాన్ని కలిగిస్తోందని చిరంజీవి తెలిపారు. పిఠాపురం ప్రజలకు ప్రజాప్రతినిధిగా మాత్రమే కాకుండా కుటుంబ సభ్యుడిలా పవన్ కళ్యాణ్ అండగా నిలుస్తున్నారని అన్నారు.
ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించే పవన్ కళ్యాణ్ తెలుగు ప్రజలందరూ మెచ్చే నాయకుడిగా తన భవిష్యత్ లక్ష్యాలను చేరుకోవాలని చిరంజీవి ఆకాంక్షించారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవిస్తూ, మరింత శక్తితో ప్రజాసేవకు పునరంకితం కావాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
Chiranjeevi wishes Pawan Kalyan success in public service on his birthday
Actor Chiranjeevi described Pawan Kalyan as a person driven by commitment, responsibility and a strong resolve to work for the welfare of people. He said Pawan Kalyan’s efforts towards rural development, tribal welfare, environmental protection and basic public needs after assuming charge as Deputy Chief Minister have made him feel proud and happy.
Chiranjeevi said he had witnessed Pawan Kalyan’s dedication and sincerity since childhood. According to him, Pawan approaches every task with complete involvement and takes every step with the intention of creating wider public benefit.
He said Pawan Kalyan has shown the same affection and warmth towards people who trust him as he does towards his family. As Deputy Chief Minister, he has been working with dedication on village development, tribal areas, environmental protection and the provision of basic infrastructure, while leaving his mark on governance.
Chiranjeevi expressed happiness over Pawan Kalyan’s efforts to find lasting solutions to several long-pending issues and take development to remote areas. He said Pawan has stood by the people of Pithapuram not merely as their elected representative but as a member of their extended family.
Wishing Pawan Kalyan success in achieving his future goals and becoming a leader admired by Telugu people, Chiranjeevi prayed for his long life, good health and continued dedication to public service. He conveyed his heartfelt birthday wishes to his younger brother.