మల్కాజిగిరిలో గణేష్ నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన | Malkajgiri Ganesh Immersion Arrangements Reviewed

గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై మల్కాజిగిరి ఏసీపీ పరిశీలన
గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా మల్కాజిగిరి పోలీసులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా మల్కాజిగిరి ఏసీపీ సఫిల్‌గూడ, బండ్లగూడ చెరువులను పరిశీలించి నిమజ్జన ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
నిమజ్జన ఊరేగింపు మార్గాలను పరిశీలించిన ఏసీపీ.. రోడ్లపై ఉన్న గుంతలు, దెబ్బతిన్న రహదారులు, చెట్ల కొమ్మలు, వేలాడుతున్న విద్యుత్ తీగలను గుర్తించారు. భక్తులకు, ఊరేగింపులో పాల్గొనే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన మరమ్మతులు, ఇతర పనులను మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (MMC) సమన్వయంతో వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం సఫిల్‌గూడ చెరువు వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ కంట్రోల్ రూమ్‌ను ఏసీపీ పరిశీలించారు. నిమజ్జనం సందర్భంగా పోలీసు విభాగాల మధ్య సమన్వయం, భద్రతా చర్యలు, పరిస్థితుల పర్యవేక్షణకు సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించారు.
గణేష్ నిమజ్జన కార్యక్రమాలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించడమే లక్ష్యంగా పోలీసులు చర్యలు చేపడుతున్నారు.
Preparing for Safe and Peaceful Ganesh Immersions
Malkajgiri Police have stepped up arrangements to ensure safe and peaceful Ganesh immersions. As part of the preparations, the ACP Malkajgiri inspected Safilguda and Bandlaguda lakes and reviewed the arrangements with officials.
The procession routes were inspected for safety concerns, including potholes, damaged roads, tree branches and hanging wires. The ACP directed officials to complete the required repairs and other works at the earliest in coordination with the Malkajgiri Municipal Corporation (MMC), so that devotees and procession participants do not face inconvenience.
The ACP also inspected the Police Control Room set up at Safilguda Lake and reviewed coordination between police teams, security arrangements and monitoring measures for the immersion proceedings.
The police are taking precautionary measures with the objective of ensuring that Ganesh immersion processions are conducted safely and peacefully without any untoward incidents.