పేదల సొంతింటి కల సాకారం – ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం…

Indiramma Housing Scheme Benefits Poor

పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులకు గృహ వసతి కల్పిస్తున్నామని అధికారులు తెలిపారు.
Fulfilling the dream of owning a house for the poor is the government’s goal, with housing being provided to eligible beneficiaries under the Indiramma housing scheme.

శామీర్‌పేట డివిజన్ దేవరయాంజాల్‌లో ప్రజా ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్టీఏ సభ్యుడు భీమిడి జైపాల్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అమలు అవుతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు గృహ వసతి అందిస్తున్నామని తెలిపారు. పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో ఇలాంటి సంక్షేమ పథకాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు.

ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులు సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు మంజూరు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు మరియు ఇందిరమ్మ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

In Devarayanjal of Shamirpet division, housewarming ceremonies under the Indiramma housing scheme were held on Monday. District RTA member Bheemidi Jaipal Reddy attended the event and addressed the gathering.

He stated that under the leadership of Chief Minister Revanth Reddy, the Indiramma housing scheme is providing homes to economically weaker sections. Such welfare initiatives play a key role in improving the living standards of the poor, he added.

Beneficiaries were advised to utilize the financial assistance provided by the government effectively. The scheme will continue as an ongoing process, ensuring houses for all eligible beneficiaries.

Local representatives, leaders, and Indiramma committee members also participated in the program.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *