Follow Traffic Rules: ACP Chakrapani

రోడ్డు భద్రత కోసం ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని పోలీసులు సూచించారు.
Police urged motorists to strictly follow traffic rules to ensure road safety and prevent accidents.
శామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని శామీర్పేట, తూంకుంట గ్రామాల్లో ‘అర్రైవ్–అలైవ్’ కార్యక్రమం భాగంగా సోమవారం రోడ్డు భద్రతపై గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జవహర్ నగర్ ఏసీపీ చక్రపాణి పాల్గొని మాట్లాడారు.
ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలను తగ్గించవచ్చని తెలిపారు. రహదారులపై జాగ్రత్తగా వాహనాలు నడపడం, నియంత్రణలో వేగం ఉంచడం అవసరమని సూచించారు.
ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అన్నారు. హెల్మెట్ వినియోగం ప్రాణాలను కాపాడగలదని, ప్రమాదాల సమయంలో గాయాల తీవ్రతను తగ్గిస్తుందని వివరించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో అడ్మిన్ ఎస్ఐ జి. సోమిరెడ్డి, పోలీస్ సిబ్బంది, స్థానిక నాయకులు, ఆశా వర్కర్లు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.
A road safety awareness meeting was held on Monday in Shamirpet and Thumkunta villages under the ‘Arrive Alive’ initiative within Shamirpet police station limits. Jawahar Nagar ACP Chakrapani addressed the gathering.
He emphasized that strict adherence to traffic rules can significantly reduce road accidents. Motorists were advised to drive carefully and maintain controlled speed on roads.
Inspector Srinath highlighted the importance of wearing helmets for two-wheeler riders. He explained that helmets can save lives and reduce the severity of injuries during accidents. Awareness was also created on precautionary measures to prevent road mishaps.
Admin SI G. Somireddy, police personnel, local leaders, ASHA workers, and villagers participated in the program.