English News Headline
May Lord Ganesha Bless the People with Happiness and Good Health: Jam Ravi

Full Telugu News Article
శామీర్పేట్, సెప్టెంబర్ 25: గణనాథుని కృపతో మూడు చింతలపల్లి మున్సిపాలిటీ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని మున్సిపల్ చైర్మన్ జాం రవి ఆకాంక్షించారు.
శుక్రవారం మూడు చింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మాపూర్ గ్రామంలో వివిధ గణేష్ మండపాల నిర్వాహకుల ఆహ్వానం మేరకు జాం రవి మండపాలను సందర్శించారు.
ఈ సందర్భంగా గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నీరజ్ గౌడ్, నాయకులు కామిడి బాబుదొర, పి. నాగరాజు, సిహెచ్. శ్రీనివాస్ గౌడ్, కటికల గోపి, బందెల ప్రభాకర్, కొల విద్యాకర్, పి. బాలేష్ పాల్గొన్నారు.
అలాగే రామ సేన యూత్ నిర్వాహకులు తాటికొండ కార్తీక్ గౌడ్, కటికల లక్కీముదిరాజ్, కటికల అభి ముదిరాజ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
Full English News Article
Shamirpet, September 25: Three Chintalapalli Municipality Chairman Jam Ravi wished that all residents of the municipality live with happiness, prosperity, good health and well-being with the blessings of Lord Ganesha.
On Friday, Jam Ravi visited various Ganesh pandals in Lakshmapur village of Three Chintalapalli Municipality following invitations from the organisers.
During his visit, he offered special prayers to Lord Ganesha and received theertha prasadam. He expressed his wishes for the happiness, prosperity and good health of the people.
Councillor Neeraj Goud and leaders Kamidi Babudora, P. Nagaraju, C.H. Srinivas Goud, Katikala Gopi, Bandela Prabhakar, Kola Vidyakar and P. Balesh participated in the programme.
Ram Sena Youth organisers Tatikonda Karthik Goud, Katikala Lakkimudhiraj and Katikala Abhi Mudhiraj, among others, were also present.