English News Headline
EPFO to Enable PF Withdrawals Through ATM and UPI by May-End

Full Telugu News Article
దేశవ్యాప్తంగా కోట్లాది మంది పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట కలిగించే నిర్ణయాన్ని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తీసుకుంటోంది. 2026 మే నెలాఖరు నాటికి ఏటీఎంలు, యూపీఐ ద్వారా నేరుగా పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ఈపీఎఫ్ఓ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
‘EPFO 3.0’ పేరుతో సేవలను పూర్తిగా డిజిటలైజ్ చేసే ప్రక్రియను సంస్థ ప్రారంభించింది. ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే ఉద్యోగులు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండా తమ పీఎఫ్ నిధులను సులభంగా పొందగలుగుతారు. దేశవ్యాప్తంగా సుమారు 7.8 కోట్ల మంది ఖాతాదారులకు ఈ సేవలు ఉపయోగపడనున్నాయి.
ఈపీఎఫ్ఓ సభ్యులకు ప్రత్యేక ఏటీఎం కార్డులను జారీ చేసే అవకాశాన్ని కూడా పరిశీలిస్తోంది. ఈ కార్డులు నేరుగా పీఎఫ్ ఖాతాలకు లింక్ అయి ఉంటాయి. అత్యవసర సమయంలో సమీప ఏటీఎం ద్వారా నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు. అంతేకాకుండా యూపీఐ సదుపాయం ద్వారా మొబైల్ నుంచే నేరుగా పేమెంట్లు చేయడం లేదా బ్యాంక్ ఖాతాకు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసుకోవడం సాధ్యమవుతుంది.
అయితే ప్రారంభ దశలో పీఎఫ్ ఖాతాలోని మొత్తం బ్యాలెన్స్‌లో సుమారు 50 శాతం వరకు మాత్రమే విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉండొచ్చని సమాచారం. ఈ సదుపాయం వినియోగించుకోవాలంటే యూఏఎన్ యాక్టివ్‌గా ఉండటం, ఆధార్, పాన్, బ్యాంక్ ఖాతా వివరాలు సరిగా లింక్ అయి ఉండటం తప్పనిసరి.
ఇక నిపుణులు మాత్రం పీఎఫ్ డబ్బులను అవసరమైనప్పుడు మాత్రమే విత్‌డ్రా చేయాలని సూచిస్తున్నారు. పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రత కోసం పీఎఫ్ నిధులు కీలకమని చెబుతున్నారు.
Full English News Article
The Employees’ Provident Fund Organisation (EPFO) is preparing to introduce a major digital upgrade that could allow PF subscribers to withdraw funds directly through ATMs and UPI platforms by the end of May 2026.
As part of its “EPFO 3.0” initiative, the organisation is working towards complete digitisation of provident fund services. The move is expected to benefit nearly 7.8 crore EPF account holders across India by making fund access faster and more convenient without visiting government offices.
According to reports, EPFO is also planning to issue special ATM cards linked directly to PF accounts. Subscribers may be able to withdraw money from nearby ATMs during emergencies. Integration with UPI services is also expected to enable direct transfers and digital payments through mobile phones.
Initially, subscribers may be allowed to withdraw up to 50 percent of the available PF balance through ATM or UPI services. To use the facility, users must ensure that their UAN is active and Aadhaar, PAN, and bank account details are properly linked with the EPFO portal.
However, financial experts are advising employees to avoid unnecessary PF withdrawals. Since provident fund savings play a critical role in retirement planning and grow through long-term compound interest, experts recommend withdrawing funds only during emergencies.