English News Headline
Tamil Nadu CM Vijay’s First Assembly Speech Goes Viral After Humorous Speaker Tradition Story

Joseph Vijay తమిళనాడు అసెంబ్లీలో తన తొలి ప్రసంగంతోనే సభ్యులను ఆకట్టుకున్నారు. కొత్త అసెంబ్లీ సమావేశాల రెండో రోజు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికల సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సభలో నవ్వులు పూయించడంతో పాటు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
మంగళవారం నిర్వహించిన ఎన్నికల్లో టీవీకే ఎమ్మెల్యే JCD Prabhakar స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే ఎం. రవిశంకర్ డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నుకోబడ్డారు. సంప్రదాయం ప్రకారం ప్రతిపక్ష నేత Udhayanidhi Stalin స్పీకర్‌ను ఛైర్ వరకు తీసుకెళ్లి కూర్చోబెట్టారు.
ఈ సందర్భంగా సీఎం విజయ్ మాట్లాడుతూ స్పీకర్‌ను ఎందుకు కుర్చీలో కూర్చోబెడతారనే అంశంపై ఆసక్తికరమైన చారిత్రక కథను వివరించారు. బ్రిటన్ పార్లమెంటరీ సంప్రదాయాల నుంచి ఈ విధానం వచ్చిందని తెలిపారు. పురాతన కాలంలో బ్రిటన్‌లో స్పీకర్ పదవి ప్రమాదకరమైందని, రాజుకు పార్లమెంట్ నిర్ణయాలు తెలియజేయాల్సిన బాధ్యత సభాపతిదేనని చెప్పారు.
ఒకవేళ రాజు తనకు వ్యతిరేకంగా వ్యవహరించారని భావిస్తే స్పీకర్‌పై కఠిన చర్యలు తీసుకునేవారని, అందుకే ఎవరూ ఆ పదవిని స్వీకరించడానికి ముందుకు వచ్చేవారు కాదని విజయ్ చమత్కారంగా చెప్పారు. ఈ నేపథ్యంలో స్పీకర్‌ను బలవంతంగా కుర్చీలో కూర్చోబెట్టే సంప్రదాయం ఏర్పడిందని వివరించారు.
అంతేకాకుండా సభలో అన్ని రాజకీయ పార్టీలకు సమాన గౌరవం ఉండాలని సీఎం విజయ్ పేర్కొన్నారు. ఒక సభ్యుడు ఉన్న పార్టీ అయినా, అధిక స్థానాలు గెలిచిన పార్టీ అయినా అందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత స్పీకర్‌పై ఉంటుందని చెప్పారు. సభ ప్రజాస్వామ్య విలువలకు అద్దం పట్టేలా ఉండాలని ఆకాంక్షించారు.
విజయ్ చేసిన ఈ ప్రసంగం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన చెప్పిన చారిత్రక నేపథ్యం నిజమేనా అనే అంశంపై నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
Full English News Article
Joseph Vijay impressed Assembly members with his maiden speech in the Tamil Nadu Legislative Assembly, as his humorous explanation about the Speaker’s chair tradition went viral on social media.
During the second day of the newly convened Assembly session, TVK MLA JCD Prabhakar was unanimously elected as the Speaker, while M. Ravishankar was chosen as Deputy Speaker. Following parliamentary tradition, Opposition leader Udhayanidhi Stalin escorted the Speaker to the chair.
Addressing the House, Vijay explained the historical reason behind the practice of physically escorting the Speaker to the chair. He said many parliamentary traditions followed in India originated from Britain.
According to Vijay, the Speaker’s position in early British parliamentary history was considered highly risky because the Speaker had the responsibility of conveying Parliament’s decisions to the King. If the King felt the Speaker acted against royal interests or displayed bias, severe punishment could follow, including execution in some historical instances.
As a result, people were reportedly reluctant to accept the Speaker’s post, leading to the tradition of “dragging” or escorting the Speaker to the chair. Vijay’s narration drew laughter from Assembly members and quickly gained traction online.
The Tamil Nadu Chief Minister also stressed that the Assembly should function with dignity and fairness. He stated that all political parties, regardless of their numerical strength, must receive equal respect in the House. He expressed hope that the Speaker and Deputy Speaker would uphold democratic traditions and parliamentary values.
The speech has now gone viral across social media platforms, with many users discussing the historical authenticity behind Vijay’s explanation of the parliamentary custom