English: 100% Tariff Risk for India: US Senate Passes Russia Sanctions Bill

భారత్–అమెరికా వాణిజ్య చర్చలు కొనసాగుతున్న వేళ అమెరికా సెనేట్ కీలక బిల్లుకు ఆమోదం తెలపడం ఆందోళన కలిగిస్తోంది. రష్యా చమురు, గ్యాస్ కొనుగోలు చేసే దేశాలపై 100 శాతం వరకు సుంకాలు విధించే అధికారం అమెరికా అధ్యక్షుడికి కల్పించే ఈ బిల్లు చట్టంగా మారితే భారత్‌పై ప్రభావం పడే అవకాశం ఉంది.
భారత్‌పై 100% టారిఫ్ ముప్పు.. ట్రంప్‌కు కీలక అధికారం!
అమెరికా సెనేట్ రష్యాపై ఆంక్షలను మరింత కఠినతరం చేసే Lindsey O. Graham Sanctioning Russia and Iran Act of 2026 బిల్లుకు 86–11 ఓట్లతో ఆమోదం తెలిపింది. రష్యా నుంచి భారీగా చమురు, సహజవాయువు కొనుగోలు చేసే దేశాలపై 100 శాతం వరకు టారిఫ్‌లు విధించే అధికారం అమెరికా అధ్యక్షుడికి ఈ బిల్లు కల్పిస్తుంది. భారత్, చైనా వంటి దేశాలు ఈ నిబంధన పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది.
ఈ బిల్లు ప్రస్తుతం సెనేట్ ఆమోదం పొందిన దశలోనే ఉంది. తదుపరి అమెరికా ప్రతినిధుల సభలో దీనిపై పరిశీలన జరగాల్సి ఉంది. అందువల్ల భారత్‌పై 100 శాతం టారిఫ్ ఇప్పటికే అమల్లోకి వచ్చిందని చెప్పడం సరైంది కాదు. బిల్లు చట్టంగా మారిన తర్వాత కూడా టారిఫ్ విధింపు అధ్యక్షుడి నిర్ణయం, ఇతర నిబంధనలపై ఆధారపడి ఉంటుంది.
బిల్లులో రష్యా రాజకీయ నాయకులు, ఆర్థిక సంస్థలు, ఇంధన ప్రాజెక్టులు, రష్యా షాడో ఫ్లీట్ తదితరాలపై ఆంక్షలను కఠినతరం చేసే నిబంధనలు కూడా ఉన్నాయి. రష్యా ఇంధనంపై ఆధారపడటాన్ని గణనీయంగా తగ్గిస్తున్న కొన్ని దేశాలకు మినహాయింపులు కల్పించే అవకాశాలు కూడా బిల్లులో ఉన్నాయి. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా కొన్ని ఆంక్షలను మినహాయించే అధికారం అధ్యక్షుడికి ఉండేలా నిబంధనలు రూపొందించారు.
రష్యా నుంచి చమురు దిగుమతుల్లో భారత్, చైనా ప్రధాన దేశాలుగా ఉన్న నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ బిల్లు చట్టంగా మారి, దాని కింద టారిఫ్‌లు అమలు చేస్తే భారత్–అమెరికా వాణిజ్య సంబంధాలపై ఒత్తిడి మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం కొనసాగుతున్న ద్వైపాక్షిక వాణిజ్య చర్చలపై కూడా దీనిప్రభావం ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
US Tariffs: 100% tariff threat looms over India
The US Senate has approved a major Russia sanctions bill that could allow President Donald Trump to impose tariffs of up to 100 per cent on imports from countries that continue to buy large quantities of Russian oil and gas. India and China are among the countries that could potentially be affected.
The Lindsey O. Graham Sanctioning Russia and Iran Act of 2026 was passed by the Senate with an 86–11 vote. The legislation targets Russian energy revenues and provides the US President with authority to impose tariffs of up to 100 per cent on imports from major buyers of Russian crude oil and natural gas.
However, the proposed 100 per cent tariff on India is not currently in force. The bill still has to go through the US House of Representatives, and any tariff action would depend on the legislation becoming law and subsequent presidential action under its provisions.
The legislation also proposes sanctions targeting senior Russian officials, financial institutions, energy projects and the Russian shadow fleet. It includes provisions for certain exemptions, including for countries that significantly reduce their dependence on Russian natural gas, as well as presidential waiver provisions in the national interest.
With India and China among the major buyers of Russian energy, the Senate vote could increase pressure on their trade relations with Washington. The development assumes added significance as India and the US continue discussions on bilateral trad