TG Inter Supply Exams 2026: ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు చెల్లించేందుకు ఇవాళే చివరి అవకాశం…

Last Date Today

.


ఫీజు చెల్లించని ఇంటర్ విద్యార్థులకు ఇది చివరి అవకాశం. తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ మరియు ఇంప్రూవ్‌మెంట్ పరీక్షల ఫీజు చెల్లింపుకు ఏప్రిల్ 23తో గడువు ముగియనుంది. ఇంకా దరఖాస్తు చేయని విద్యార్థులు ఈ రోజు ముగింపు సమయానికి ఫీజు చెల్లించాలని ఇంటర్ బోర్డు సూచించింది.

హైదరాబాద్, ఏప్రిల్ 23: తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు ఇంకా ఫీజు చెల్లించని విద్యార్థులకు ఇంటర్ బోర్డు అలర్ట్ జారీ చేసింది. ఈ రోజు (ఏప్రిల్ 23)తో ఫీజు చెల్లింపు తుది గడువు ముగియనుందని స్పష్టం చేసింది. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులు, అలాగే ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు రాయదలచిన అభ్యర్థులు ఈ రోజు ముగింపు సమయానికి దరఖాస్తు ఫీజు చెల్లించాలని అధికారులు సూచించారు.

వాస్తవానికి ఫీజు చెల్లింపు గడువు ఏప్రిల్ 20తో ముగిసింది. అయితే గడువు పొడిగించాలని విద్యార్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని ఇంటర్ బోర్డు ఏప్రిల్ 23 వరకు అదనపు అవకాశం కల్పించింది.

షెడ్యూల్ ప్రకారం ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 13 నుంచి మే 21 వరకు నిర్వహించబడతాయి. ప్రాక్టికల్ పరీక్షలు మే 22 నుంచి మే 25 వరకు జరుగుతాయి. ఇంగ్లిష్ సబ్జెక్ట్ ప్రాక్టికల్ పరీక్షను మే 26న నిర్వహించనున్నారు.

సబ్జెక్టుల్లో ఫెయిల్ అయిన విద్యార్థులతో పాటు మెరుగైన మార్కులు సాధించాలనుకునే వారు కూడా ఇంప్రూవ్‌మెంట్ కోసం మళ్లీ పరీక్షలు రాయవచ్చు. ఈ అవకాశం కోసం కూడా ఈ రోజే చివరి గడువు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారు 1.5 లక్షల మంది విద్యార్థులు పరీక్ష ఫీజులను చెల్లించినట్లు బోర్డు అధికారులు వెల్లడించారు.

తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ 2026 టైం టేబుల్:

మే 13 – సెకండ్ లాంగ్వేజ్
మే 14 – ఇంగ్లిష్
మే 15 – మ్యాథ్స్ A, బోటనీ, పొలిటికల్ సైన్స్
మే 16 – మ్యాథ్స్ 2A, జువాలజీ, హిస్టరీ
మే 18 – ఫిజిక్స్, ఎకనామిక్స్
మే 19 – కెమిస్ట్రీ, కామర్స్
మే 20 – పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్
మే 21 – మోడ్రన్ లాంగ్వేజ్, జాగ్రఫీ
This is the final chance for Intermediate students who have not yet paid the examination fee. The last date for Telangana Intermediate Advanced Supplementary and Improvement Exam fee payment ends on April 23. Students who have not applied yet are advised to complete the fee payment by the end of today, according to the Intermediate Board.

Hyderabad, April 23: The Telangana Intermediate Board has issued an alert for students who have not yet paid the fee for Advanced Supplementary Examinations. The final deadline for fee payment ends today, April 23. First-year and second-year students, along with those appearing for improvement exams, must complete the payment before the end of the day.

Originally, the deadline for fee payment ended on April 20. However, considering repeated requests from students, the Board extended the last date till April 23 and provided an additional opportunity.

As per the official schedule, Intermediate Advanced Supplementary Examinations will be conducted from May 13 to May 21. Practical examinations will be held from May 22 to May 25, while the English practical examination is scheduled for May 26.

Apart from students who failed in subjects, those aiming for better marks can also reappear under the improvement category. Today is the final deadline for them as well. Board officials stated that nearly 1.5 lakh students across the state have already paid their examination fees.

Telangana Inter Supplementary Exams 2026 Time Table:

May 13 – Second Language
May 14 – English
May 15 – Maths A, Botany, Political Science
May 16 – Maths 2A, Zoology, History
May 18 – Physics, Economics
May 19 – Chemistry, Commerce
May 20 – Public Administration, Bridge Course Maths
May 21 – Modern Language, Geography

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *