జూన్ 2లోగా మూడు టిమ్స్ ఆసుపత్రులు పూర్తి చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి

English News Headline

Telangana CM Revanth Reddy Sets June 2 Deadline for Alwal, LB Nagar TIMS Hospitals and Warangal Super Speciality Hospital

Full Telugu News Article

హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వ వైద్య సేవలను మరింత బలోపేతం చేసే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. వచ్చే ఏడాది జూన్ 2 నాటికి అల్వాల్, ఎల్బీ నగర్ టిమ్స్ ఆసుపత్రులు, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులు, నిమ్స్ విస్తరణ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణాన్ని వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పూర్తిచేసి ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు.

ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. టిమ్స్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ, నిమ్స్ విస్తరణ, ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణ పనులతో పాటు అవసరమైన వైద్య పరికరాల కొనుగోలు, వైద్యులు, సిబ్బంది నియామకాలను ఒకేసారి పూర్తి చేయాలని ఆదేశించారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకల సంఖ్యను 30 వేల నుంచి 38 వేలకు పెంచినట్లు సీఎం తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఒక్కో కుటుంబానికి అందించే వైద్య చికిత్సల బీమా కవరేజీని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచిన విషయాన్ని గుర్తుచేశారు.

టిమ్స్ ఆసుపత్రుల్లో నియామకాలు, నిర్వహణపై కీలక నిర్ణయాలు

సనత్‌నగర్, అల్వాల్, ఎల్బీ నగర్ టిమ్స్ ఆసుపత్రుల్లో వైద్యులు, ఇతర సిబ్బంది నియామకాలకు ఏకీకృత విధానం అమలు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. వైద్య సేవల అవసరాలను బట్టి మూడు ఆసుపత్రుల మధ్య వైద్యులు, సిబ్బందిని బదిలీ చేసే వెసులుబాటు ఉండాలని చెప్పారు.

టిమ్స్ ఆసుపత్రుల నిర్వహణ, హౌస్‌కీపింగ్ సిబ్బందిని ఔట్‌సోర్సింగ్ విధానంలో నియమించాలని ఆదేశించారు. ఆసుపత్రుల పర్యవేక్షణకు గ్రూప్-1 అధికారులను నియమిస్తామని, నిర్వహణ సిబ్బందిపై పర్యవేక్షణ కోసం విశ్రాంత సైనికాధికారుల సేవలను వినియోగించుకుంటామని తెలిపారు.

నిమ్స్ రోగులకు సనత్‌నగర్ టిమ్స్ సేవలు

నిమ్స్‌లో శస్త్రచికిత్సలకు ఎక్కువ సమయం పడుతున్న నేపథ్యంలో సనత్‌నగర్ టిమ్స్‌ను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సీఎం ఆదేశించారు. నిమ్స్‌లో పడకలు అందుబాటులో లేకపోయినా, శస్త్రచికిత్సలు ఆలస్యమైనా రోగులకు సనత్‌నగర్ టిమ్స్‌లో సేవలు అందించాలని సూచించారు.

ఈ రెండు ఆసుపత్రుల మధ్య సమన్వయం కోసం వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, నిమ్స్, టిమ్స్ డైరెక్టర్లు నిరంతరం సంప్రదింపులు జరపాలని చెప్పారు. టిమ్స్‌లో పూర్తిస్థాయి వైద్యుల నియామకాలు జరిగే వరకు అవసరమైన వైద్యులను బయటి నుంచి నియమించుకోవాలని, ఇందుకు కావాల్సిన నిధులను వెంటనే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.

79 డయాలసిస్ కేంద్రాల పనులు వేగవంతం చేయాలి

అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా 16 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు సీఎం వెల్లడించారు. నిర్మాణంలో ఉన్న మరో 79 డయాలసిస్ కేంద్రాల పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

టిమ్స్‌తో పాటు వైద్య కళాశాలలు, నర్సింగ్ కళాశాలల నిర్మాణాలు, పరికరాల కొనుగోలు ప్రక్రియలను కూడా సమాంతరంగా పూర్తి చేయాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది హాజరును కృత్రిమ మేధ పర్యవేక్షణతో బయోమెట్రిక్ విధానం ద్వారా పర్యవేక్షించాలని ఆదేశించారు.

వైద్య సిబ్బంది నియామకాలపై కీలక గణాంకాలు

మూడేళ్లలో వైద్యులు, నర్సులు, ఏఎన్‌ఎంలు, పారామెడికల్ సిబ్బంది కలిపి 13,401 నియామకాలు పూర్తి చేసినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. మరో 5,640 నియామకాల ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఔట్‌పేషెంట్ల సంఖ్య 7 కోట్ల నుంచి 9 కోట్లకు, ఇన్‌పేషెంట్ల సంఖ్య 23 లక్షల నుంచి 24.30 లక్షలకు పెరిగినట్లు సమీక్షలో పేర్కొన్నారు.

రాష్ట్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి గతంలో సగటున 3.9 శాతం నిధులు కేటాయించగా, గత మూడేళ్లుగా సగటున 4.8 శాతం కేటాయిస్తున్నట్లు సీఎం వివరించారు. ప్రజారోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ వైద్యారోగ్య శాఖకు అవసరమైన నిధులు విడుదల చేస్తామని స్పష్టం చేశారు.
Hyderabad: Telangana Chief Minister A. Revanth Reddy has directed officials to complete the construction of the TIMS hospitals at Alwal and LB Nagar, Warangal Super Speciality Hospital and the expansion works at NIMS by June 2 next year. He also instructed officials to complete the construction of the new Osmania General Hospital by December next year and make medical services available to the public.

The Chief Minister conducted a high-level review meeting at Bodhi Pavilion in MCR HRD Institute, along with Health Minister Damodar Rajanarasimha. The meeting reviewed the progress of TIMS hospitals, Warangal Super Speciality Hospital, NIMS expansion and the new Osmania Hospital project.

Revanth Reddy directed officials to complete hospital construction, procurement of medical equipment and recruitment of doctors and other staff simultaneously. He stressed the need for a coordinated action plan to ensure that the hospitals become fully operational without unnecessary delays.

Government Hospital Bed Capacity Increased to 38,000

The Chief Minister stated that the government had increased the number of beds in government hospitals from 30,000 to 38,000.

He also recalled that the coverage under the Rajiv Aarogyasri scheme had been increased from ₹5 lakh to ₹10 lakh per family to improve access to healthcare services.

Unified Recruitment System for TIMS Hospitals

The Chief Minister directed officials to introduce a unified recruitment system for doctors and other staff at Sanathnagar, Alwal and LB Nagar TIMS hospitals.

He said doctors and staff should be transferable between the three hospitals depending on medical service requirements and patient demand.

He also instructed officials to recruit hospital maintenance and housekeeping personnel through outsourcing. Group-1 officers would be appointed to supervise the TIMS hospitals, while retired military officers would be engaged to monitor maintenance and housekeeping operations.

The Chief Minister said separating administrative responsibilities from medical duties would allow doctors to concentrate entirely on patient care.

Sanathnagar TIMS to Support NIMS Patients

Revanth Reddy directed officials to make full use of Sanathnagar TIMS to reduce the burden on NIMS.

He said patients should be referred to Sanathnagar TIMS whenever beds were unavailable at NIMS or surgeries were delayed due to workload.

The Principal Secretary of the Medical and Health Department and the directors of NIMS and TIMS were instructed to coordinate regularly to ensure effective utilisation of available facilities.

Until permanent doctor recruitment at TIMS hospitals is completed, officials should arrange doctors from outside. The Chief Minister assured that the required funds would be released immediately.

79 More Dialysis Centres Under Construction

The Chief Minister stated that 16 new dialysis centres had been established since the government assumed office.

He directed officials to speed up the construction of another 79 dialysis centres and make them available to the public as early as possible.

He also instructed officials to complete the construction of medical colleges and nursing colleges, along with the procurement of necessary equipment, through a coordinated action plan.

AI-Based Biometric Attendance System in Government Hospitals

Revanth Reddy directed officials to implement a biometric attendance system with AI-based monitoring for doctors and other employees working in government hospitals.

He emphasised the importance of ensuring staff accountability and improving hospital administration.

13,401 Healthcare Appointments Completed

The Chief Minister stated that 13,401 appointments had been completed over the past three years, covering doctors, nurses, ANMs and paramedical personnel.

He said the recruitment process for another 5,640 positions was currently underway.

During the review, he expressed satisfaction over the increase in outpatient numbers from 7 crore to 9 crore and inpatient numbers from 23 lakh to 24.30 lakh in government hospitals.

He also pointed out that the average allocation for the healthcare sector in the state budget had increased from 3.9 per cent earlier to 4.8 per cent over the past three years.

The Chief Minister reiterated that the government would release the required funds to strengthen public healthcare infrastructure and improve medical services across Telangana.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *