ప్రశాంతి కుటీరం స్వర్ణోత్సవాల్లో పాల్గొన్న ప్రధాని మోదీ

English News Headline

PM Narendra Modi Attends Golden Jubilee Celebrations of Prashanti Kutiram in Bengaluru, Highlights India’s Global Yoga Recognition

బెంగళూరు: భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలు, యోగా, ఆయుర్వేదానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కర్ణాటకలోని బెంగళూరులో ప్రశాంతి కుటీరం స్వర్ణోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగా, ఆయుర్వేద రంగాల్లో భారత్ సాధిస్తున్న పురోగతిని వివరించారు.

గత 12 ఏళ్లలో భారతదేశం తన సంస్కృతి, ప్రత్యేక గుర్తింపు, విజ్ఞానం, శాస్త్రీయ పరిజ్ఞానాన్ని ప్రపంచానికి ఆత్మవిశ్వాసంతో పరిచయం చేస్తోందని ప్రధాని పేర్కొన్నారు. భారతదేశం తీసుకున్న చొరవ ఫలితంగానే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచ దేశాలు జరుపుకుంటున్నాయని తెలిపారు.

పోటీ క్రీడగా యోగాసనానికి గుర్తింపు

యోగాసనానికి అధికారికంగా పోటీ క్రీడగా గుర్తింపు లభించిందని ప్రధాని మోదీ వెల్లడించారు. ఖేలో ఇండియా, జాతీయ క్రీడల వంటి పోటీల్లో యోగాసనానికి స్థానం కల్పించడం ద్వారా యోగా సాధకులకు కొత్త అవకాశాలు ఏర్పడ్డాయని చెప్పారు.

దీంతో యోగా అభ్యాసకులు పోటీ టోర్నమెంట్లలో పాల్గొనేందుకు మార్గం సుగమమైందని వివరించారు.

ఆయుర్వేద పరిశోధనలకు ప్రోత్సాహం

ఆయుర్వేదానికి సంబంధించిన పరిశోధనలు, ఆయుర్వేద ఆధారిత పేటెంట్లను ప్రోత్సహిస్తున్నామని ప్రధానమంత్రి తెలిపారు. ఈ ప్రయత్నాల ఫలితాలు ప్రస్తుతం కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.

భారత్ నుంచి ఆయుష్, మూలికా ఉత్పత్తుల ఎగుమతులు నిరంతరం పెరుగుతున్నాయని వెల్లడించారు. సంప్రదాయ వైద్య విధానాలకు పరిశోధన, శాస్త్రీయ గుర్తింపు, అంతర్జాతీయ మార్కెట్లలో అవకాశాలు కల్పించడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని ఆయన ప్రసంగంలో వివరించారు.

ప్రశాంతి కుటీరం స్వర్ణోత్సవాల సందర్భంగా యోగా, ఆయుర్వేదం, భారతీయ విజ్ఞాన సంప్రదాయాల ప్రాధాన్యతను ప్రధాని మరోసారి ప్రస్తావించారు.

Full English News Article

Bengaluru: Prime Minister Narendra Modi participated in the Golden Jubilee celebrations of Prashanti Kutiram in Bengaluru, Karnataka, and highlighted India’s growing global recognition in the fields of yoga, traditional knowledge and Ayurveda.

Addressing the occasion, the Prime Minister said that over the past 12 years, India had presented its culture, identity, knowledge and scientific heritage to the world with confidence.

He said India’s initiative had contributed to the global recognition of yoga, with countries across the world celebrating the International Day of Yoga.

Yogasana Gains Recognition as a Competitive Sport

The Prime Minister highlighted the official recognition of Yogasana as a competitive sport.

He noted that Yogasana had secured a place in sporting events such as Khelo India and the National Games, creating new opportunities for yoga practitioners to participate in competitive tournaments.

According to Modi, this recognition has opened additional avenues for practitioners to demonstrate their skills through organised sporting competitions.

Government Encourages Ayurveda Research and Patents

The Prime Minister also highlighted efforts to promote research related to Ayurveda and encourage Ayurveda-based patents.

He said the results of these initiatives were becoming visible, with exports of AYUSH and herbal products from India continuing to increase.

Modi emphasised India’s traditional knowledge systems and their growing presence internationally through research, innovation and exports.

The Golden Jubilee celebrations of Prashanti Kutiram provided an occasion to highlight the importance of yoga, Ayurveda and India’s traditional knowledge heritage.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *