మద్దూరులో రెసిడెన్షియల్ పాఠశాల పనుల పరిశీలన.. భూములు ఇచ్చిన కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు…

English: Revanth Reddy Inspects Residential School Works in Maddur

నారాయణపేట మద్దూరులో సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల పనుల పరిశీలన

నారాయణపేట జిల్లా మద్దూరులో నిర్మిస్తున్న సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. పాఠశాల నిర్మాణ ప్రణాళికలను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు.

మద్దూరు పర్యటనలో భాగంగా నిర్మాణంలో ఉన్న సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల ప్రాంగణాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. పాఠశాల నిర్మాణ ప్రణాళిక, పనుల పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రాంగణమంతా కలియతిరిగి నిర్మాణానికి సంబంధించి పలు సూచనలు చేశారు.

పదేళ్ల క్రితం ప్రజల అవసరాల కోసం కొంత భూమిని సొంత డబ్బుతో కొనుగోలు చేసిన స్థానికులు, అనంతరం ఆ భూమిని ప్రభుత్వానికి అప్పగించారు. ప్రస్తుతం అదే స్థలంలో సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలను ప్రభుత్వం నిర్మిస్తోంది.

పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి స్థానికులతో మాట్లాడి వారి సమస్యలు, విజ్ఞాపనలను స్వీకరించారు. గతంలో భూమి కొనుగోలు సమయంలో భూములు ఇచ్చిన రైతులను గుర్తించి వారితోనూ మాట్లాడారు.

భూములు ఇచ్చిన రైతుల కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.


Narayanpet Maddur Residential School Works Inspected

Chief Minister Revanth Reddy inspected the ongoing construction of a Social Welfare Residential School at Maddur in Narayanpet district and reviewed the construction plans. He also interacted with local residents and directed officials to sanction Indiramma houses for families who had given their land for the project.

During his district visit, Revanth Reddy inspected the school premises and reviewed the construction plan and progress of the works with officials. He also walked through the campus and issued several directions regarding the development of the facility.

About a decade ago, land was purchased with personal funds to meet the needs of local people and was later handed over to the government. The government is now constructing the Social Welfare Residential School on the site.

The Chief Minister interacted with local residents and received their representations regarding various issues. He also met farmers who had provided their land during the earlier land purchase process.

Officials were directed to sanction Indiramma houses for the families of the farmers who had given their land.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *