English News Headline
Khelo India Youth Games 2026: CM Revanth Reddy Reviews Preparations, Telangana Allocates ₹203 Crore

Full Telugu News Article
హైదరాబాద్: తెలంగాణను అంతర్జాతీయ క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 ఏర్పాట్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. డిసెంబర్ 11 నుంచి 22 వరకు తొలిసారిగా తెలంగాణలో జరగనున్న ఈ క్రీడలు రాష్ట్ర క్రీడారంగ భవిష్యత్తుకు బలమైన పునాదిగా నిలుస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.
మంత్రి వాకిటి శ్రీహరితో పాటు సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో ఏర్పాట్ల పురోగతి, స్టేడియాల అభివృద్ధి, క్రీడాకారులకు శిక్షణ, ప్రారంభోత్సవం, ముగింపు వేడుకల నిర్వహణపై ముఖ్యమంత్రి చర్చించారు.
యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేలా డిసెంబర్ 11న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ప్రారంభ వేడుకలను ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ప్రారంభోత్సవం, గచ్చిబౌలి స్టేడియంలో ముగింపు వేడుకలు నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
స్టేడియాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
క్రీడల నిర్వహణ కోసం స్టేడియాల పునరుద్ధరణ పనుల్లో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అభివృద్ధి పనులపై నిరంతర పర్యవేక్షణతో పాటు విజిలెన్స్ నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ప్రారంభ, ముగింపు వేడుకల పర్యవేక్షణ బాధ్యతలను మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అప్పగించాలని సూచించారు. హైదరాబాద్‌తో పాటు వివిధ జిల్లాల్లోనూ పోటీలు జరగనున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లాల వారీగా మంత్రులను ఇన్చార్జిలుగా నియమించి ఏర్పాట్లను పర్యవేక్షించాలని చెప్పారు.
జిల్లాల వారీగా మంత్రులకు బాధ్యతలు
ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణను పర్యవేక్షించేందుకు ముఖ్యమంత్రి జిల్లాల వారీగా బాధ్యతలను కేటాయించారు.
- పొన్నం ప్రభాకర్: హైదరాబాద్
- దుద్దిళ్ల శ్రీధర్ బాబు: రంగారెడ్డి
- జూపల్లి కృష్ణారావు: మహబూబ్‌నగర్
- పొంగులేటి శ్రీనివాస రెడ్డి: వరంగల్
- అడ్లూరి లక్ష్మణ్ కుమార్: కరీంనగర్
- తుమ్మల నాగేశ్వరరావు: ఖమ్మం
- ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి: నిజామాబాద్
ఈ మంత్రులు తమకు కేటాయించిన ప్రాంతాల్లో క్రీడల నిర్వహణ, మౌలిక సదుపాయాలు, ఇతర ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు.
ఖేలో ఇండియాలో కర్రసాముకు ప్రత్యేక గుర్తింపు
తెలంగాణ సంప్రదాయ యుద్ధకళ అయిన కర్రసాముకు ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో తొలిసారిగా ప్రదర్శన క్రీడగా అవకాశం కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్రసాముకు సంబంధించిన ప్రత్యేక బ్రోచర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.
జాతీయ స్థాయిలో కర్రసాముకు గుర్తింపు తీసుకురావడం ద్వారా తెలంగాణ సంప్రదాయ క్రీడను మరింత ప్రోత్సహించవచ్చని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.
27 క్రీడాంశాల్లో శిక్షణ.. 1,334 మంది క్రీడాకారులకు శిబిరాలు
ఖేలో ఇండియా యూత్ గేమ్స్ కోసం రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. మొత్తం 27 క్రీడాంశాలకు సంబంధించి 1,334 మంది తెలంగాణ క్రీడాకారులకు శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
రాష్ట్రం నుంచి పోటీల్లో పాల్గొనే 861 మంది క్రీడాకారులు, కోచ్‌లకు స్పోర్ట్స్ కిట్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
ఇప్పటికే 14 స్టేడియాల్లో అభివృద్ధి పనులు పూర్తయ్యాయని, మిగిలిన ఆరు స్టేడియాల్లో పనులను నవంబర్ నెలాఖరులోగా పూర్తి చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. అలాగే 27 క్రీడాంశాలకు అవసరమైన క్రీడా పరికరాలను కూడా సిద్ధం చేస్తున్నట్లు వివరించారు.
ఖేలో ఇండియా కోసం రూ.203 కోట్ల కేటాయింపు
ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణ కోసం తెలంగాణ ప్రభుత్వం మొత్తం రూ.203 కోట్లు ఖర్చు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం తన వాటాగా రూ.21 కోట్లు కేటాయించింది.
స్టేడియాల అభివృద్ధి, ప్రపంచస్థాయి ప్రమాణాలతో మౌలిక సదుపాయాల కల్పన, అత్యాధునిక క్రీడా పరికరాల కొనుగోలు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.120 కోట్లు వెచ్చిస్తోంది.
భవిష్యత్తులోనూ క్రీడాకారులకు ఉపయోగపడేలా క్రీడా ప్రాంగణాలను శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
ఖేలో ఇండియా యూత్ గేమ్స్ విజయవంతంగా నిర్వహించడం ద్వారా తెలంగాణను జాతీయ, అంతర్జాతీయ క్రీడా వేదికగా నిలబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
Full English News Article
Hyderabad: Telangana Chief Minister A. Revanth Reddy has reviewed preparations for the Khelo India Youth Games 2026, scheduled to be held across the state from December 11 to 22. He said the prestigious sporting event would lay a strong foundation for Telangana’s ambition to emerge as an international sports destination.
During a review meeting with Sports and Youth Services Minister Vakiti Srihari and senior officials from the concerned departments, the Chief Minister assessed the progress of stadium development, athlete training programmes, sporting equipment arrangements and preparations for the opening and closing ceremonies.
Revanth Reddy directed officials to organise the opening ceremony on December 11 in a grand manner, reflecting the enthusiasm and sporting spirit of young athletes.
He instructed officials to conduct the opening ceremony at LB Stadium and the closing ceremony at Gachibowli Stadium in Hyderabad.
CM Stresses Quality in Stadium Development
The Chief Minister directed officials not to compromise on the quality of stadium renovation and infrastructure development works.
He also called for continuous monitoring and vigilance oversight to ensure that the preparations meet the required standards.
He suggested assigning responsibilities for supervising the opening and closing ceremonies to ministers, MPs, MLAs and MLCs.
Since competitions will be conducted in Hyderabad as well as various districts, ministers will also be appointed as district-level in-charges to monitor arrangements.
Ministers Assigned District-wise Responsibilities
The Chief Minister directed the following ministers and government adviser to supervise preparations in their respective areas:
- Ponnam Prabhakar: Hyderabad
- Duddilla Sridhar Babu: Rangareddy
- Jupally Krishna Rao: Mahabubnagar
- Ponguleti Srinivasa Reddy: Warangal
- Adluri Laxman Kumar: Karimnagar
- Tummala Nageswara Rao: Khammam
- Government Adviser P. Sudarshan Reddy: Nizamabad
They will oversee infrastructure development, event arrangements and coordination with the concerned departments.
Telangana’s Traditional Karrasaamu to Feature
In a significant initiative to promote Telangana’s traditional martial art, Karrasaamu (stick fighting) will make its debut as a demonstration sport at the Khelo India Youth Games.
The Chief Minister unveiled a special brochure prepared to promote the traditional art.
He observed that introducing Karrasaamu on a national sporting platform would help bring greater recognition to the traditional martial art and encourage its development in Telangana.
Training Camps for 1,334 Athletes
Officials informed the Chief Minister that training camps were being conducted for 1,334 Telangana athletes across 27 sporting disciplines.
Sports kits are also being distributed to 861 athletes and coaches representing the state at the youth games.
Regarding infrastructure, officials reported that development works had been completed at 14 stadiums. Work at the remaining six stadiums is scheduled to be completed by the end of November.
Arrangements are also being made to ensure the availability of equipment required for all 27 sporting disciplines.
Telangana Allocates ₹203 Crore for the Games
The Telangana Government is spending a total of ₹203 crore towards organising the Khelo India Youth Games 2026. The Central Government has allocated ₹21 crore as its contribution.
Of the state’s expenditure, ₹120 crore is being spent on stadium infrastructure development, facilities meeting international standards and the procurement of modern sporting equipment.
The government is also developing sports facilities on a permanent basis so that they can continue to benefit athletes beyond the event.
Through the successful organisation of the Khelo India Youth Games, Telangana aims to strengthen its position as a major national and international sporting destination.