కరీంనగర్ విద్యార్థిని వినూత్న ఆవిష్కరణ

English News Headline

Karimnagar BTech Student Develops Smart Airbag Jacket for Two-Wheeler Rider Safety


Full Telugu News Article

కరీంనగర్ జిల్లాలోని తిమ్మాపూర్‌లో ఉన్న జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన బీటెక్ విద్యార్థిని పెర్కరి శ్రీచందన వినూత్న ఆవిష్కరణతో జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది. ఈసీఈ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఆమె ద్విచక్ర వాహనదారుల భద్రత కోసం “స్మార్ట్ వేరియబుల్ ఎయిర్ బ్యాగ్ సిస్టమ్ ఫర్ టూ వీలర్ రైడర్ సేఫ్టీ” అనే ప్రత్యేక ప్రాజెక్టును రూపొందించింది.

శ్రీచందన తండ్రి ఇటీవల జరిగిన బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడటం ఆమెను ఈ ఆలోచన వైపు మళ్లించింది. కార్లలో ప్రమాద సమయంలో ఎయిర్ బ్యాగ్‌లు తెరుచుకుని ప్రయాణికులను రక్షిస్తున్నట్లే, బైక్ రైడర్ల కోసం కూడా ఎయిర్ బ్యాగ్ వ్యవస్థ ఉంటే ప్రాణనష్టం తగ్గుతుందని ఆమె భావించింది.

ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా బైక్ రైడర్ ధరించే ప్రత్యేక జాకెట్ లేదా కోటులో ఎయిర్ బ్యాగ్ బెలూన్లు అమర్చే విధంగా రూపకల్పన చేస్తున్నారు. ప్రమాద సమయంలో రైడర్ కిందపడిన వెంటనే ఈ బెలూన్లు ఆటోమేటిక్‌గా తెరుచుకుని శరీరాన్ని రక్షించేలా టెక్నాలజీ పనిచేస్తుంది. హెల్మెట్ తలకు రక్షణ కల్పించినట్లే, ఈ జాకెట్ మొత్తం శరీరాన్ని కవర్ చేసేలా డిజైన్ చేస్తున్నారు.

శ్రీచందన రూపొందించిన ఈ ఆవిష్కరణకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని మినిస్ట్రీ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ నిర్వహించిన ఎంఎస్ఎంఈ ఐడియా హ్యాకథాన్ 5.0లో గుర్తింపు లభించింది. దేశవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు, అధ్యాపకులు, శాస్త్రవేత్తలు తమ ప్రాజెక్టులను సమర్పించగా, కేవలం 502 వినూత్న ఆలోచనలను మాత్రమే ఎంపిక చేశారు. తెలంగాణ నుంచి ఎంపికైన వారిలో శ్రీచందన కూడా ఒకరు.

ఈ ప్రాజెక్ట్ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రూ.12 లక్షల గ్రాంట్ మంజూరు చేసింది. ప్రాజెక్ట్ విజయవంతమైతే భవిష్యత్తులో బైక్ ప్రమాదాల్లో మరణాలు, తీవ్ర గాయాల సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.


Full English News Article

A BTech student from Jyothishmathi Engineering College in Thimmapur of Karimnagar district has earned national recognition for developing an innovative safety solution for two-wheeler riders. Perkari Srichandana, a final-year Electronics and Communication Engineering (ECE) student, designed a “Smart Variable Airbag System for Two-Wheeler Rider Safety” aimed at reducing fatalities and severe injuries in bike accidents.

The idea was inspired by a personal incident after her father suffered serious injuries in a motorcycle accident. Observing how airbags in cars help save passengers during crashes, Srichandana started working on a similar protective system for bike riders.

As part of the project, special airbags are integrated into a jacket or protective coat worn by the rider. During an accident, the airbags automatically inflate when the rider falls, helping protect vital parts of the body from severe impact injuries. The system is designed to function alongside a helmet, offering full-body protection to riders.

Her innovation received appreciation at the MSME Idea Hackathon 5.0 conducted by the Ministry of Micro, Small and Medium Enterprises. Thousands of students, scientists, and faculty members from across India submitted their ideas, but only 502 innovative projects were selected nationwide. Srichandana was among the selected innovators from Telangana.

Recognising the potential of the project, the Central government sanctioned a grant of Rs.12 lakh for further development. Experts believe that if successfully implemented, the technology could significantly reduce deaths and serious injuries in two-wheeler accidents across the country.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *