English News Headline
Indiramma Housing Scheme Brings Joy to Poor Families in Paleru, Says Minister Srinivas Reddy

తెలుగు వార్త
ఖమ్మం జిల్లా: ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేద కుటుంబాల సొంతింటి కలలను సాకారం చేయడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పాలేరు నియోజకవర్గ పర్యటనలో భాగంగా లింగరాంతండా గ్రామపంచాయతీ పరిధిలోని గన్యా తండాలో నివసిస్తున్న గుగులోత్ భద్రు – లక్ష్మి దంపతులను ఆయన పరామర్శించారు.
ఈ సందర్భంగా లబ్ధిదారుల కళ్లల్లో సొంతింటి కల నెరవేరిన ఆనందాన్ని చూడటం తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని మంత్రి పేర్కొన్నారు. లబ్ధిదారుల కంటే తనకే ఎక్కువ ఆనందం కలిగిందని ఆయన అన్నారు.
ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రతి నిరుపేద కుటుంబంలో కొత్త ఆశలను నింపుతోందని మంత్రి తెలిపారు. ప్రతి పేద కుటుంబానికి సొంతిల్లు నిర్మించుకోవాలనే చిరకాల కోరికను నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని చెప్పారు. పేదల జీవితాల్లో శాశ్వత మార్పు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.
English News Article
Khammam: Telangana Revenue and Housing Minister Ponguleti Srinivas Reddy said the Indiramma Housing Scheme is fulfilling the long-cherished dream of home ownership for poor families across the state.
During his visit to the Paleru Assembly constituency, the minister met beneficiaries Guguloth Bhadru and Lakshmi from Ganya Thanda under Lingaram Thanda Gram Panchayat. He said witnessing the family’s happiness after their dream of owning a house became a reality gave him immense satisfaction.
The minister stated that the people-oriented government’s Indiramma Housing Scheme is bringing hope and dignity to economically weaker families. He added that ensuring every deserving poor family has a permanent home remains one of the government’s key welfare priorities.