రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇందిరా గాంధీ కృషి రత్న పురస్కారాలు ప్రదానం

English News Headline

CM Revanth Reddy Presents Indira Gandhi Krushi Ratna Awards to Agricultural Contributors in Telangana

Full Telugu News Article

సాగు బాగుంటేనే సుభిక్షమైన తెలంగాణ సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తామని తెలిపారు.

వ్యవసాయ రంగానికి విశేష సేవలు అందించిన ప్రముఖులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో ఇందిరా గాంధీ కృషి రత్న పురస్కారాలను ప్రదానం చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ ఎంపిక చేసిన వ్యవసాయ శాస్త్రవేత్తలు, పాత్రికేయులు, రైతులకు ఈ అవార్డులను అందజేశారు.

ఈ పురస్కారాలకు డాక్టర్ ఎం. సుగుణాకర్ రెడ్డి, డాక్టర్ ఎస్.డి. శిఖామణి వ్యవసాయ శాస్త్రవేత్తల విభాగంలో ఎంపికయ్యారు. పాత్రికేయుడిగా ఆర్. దిలీప్ రెడ్డి, గిరిజన రైతుగా లోనావత్ శాంతా బాయి, సేంద్రియ రైతుగా కె. లావణ్య అవార్డులు అందుకున్నారు.

ఈ సందర్భంగా ప్రధానమంత్రిగా ఇందిరా గాంధీ వ్యవసాయ అభివృద్ధికి అందించిన సహకారం, ఆమె హయాంలో సాగు రంగంలో చోటుచేసుకున్న అభివృద్ధిపై తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ రూపొందించిన పుస్తకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, రాష్ట్ర రైతు కమిషన్ ఛైర్మన్ ఎం. కోదండ రెడ్డి, కమిషన్ సభ్యులు కె.వి.ఎన్. రెడ్డి, ఎం. భవాని రెడ్డితో పాటు పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.

Full English News Article

Telangana Chief Minister A. Revanth Reddy said that a prosperous Telangana could be achieved only through a strong agricultural sector. He stated that completing irrigation projects and ensuring irrigation water reaches every acre were among the government’s key objectives.

The Chief Minister presented the Indira Gandhi Krushi Ratna Awards to distinguished individuals who have made significant contributions to agriculture. The awards were presented at his residence to scientists, a journalist and farmers selected by the Telangana State Agriculture and Farmers Welfare Commission.

Dr. M. Sugunakar Reddy and Dr. S. D. Shikhamani were selected in the agricultural scientists category. R. Dileep Reddy was recognised for his contribution as a journalist, while tribal farmer Lonavath Shanta Bai and organic farmer K. Lavanya were also honoured.

On the occasion, Revanth Reddy unveiled a book prepared by the Telangana State Agriculture and Farmers Welfare Commission. The publication highlights former Prime Minister Indira Gandhi’s contribution to agricultural development and the progress made in the agricultural sector during her tenure.

State Revenue Minister Ponguleti Srinivas Reddy, MLC and TPCC president Mahesh Kumar Goud, Farmers Commission Chairman M. Kodanda Reddy, commission members K.V.N. Reddy and M. Bhavani Reddy, along with other representatives, attended the programme.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *